సమ్మె తగ్గేదే లేదు..మరింత ఉదృతం చేస్తాం..
1 min read-ప్రభుత్వాన్ని హెచ్చరించిన అంగన్వాడీ సిబ్బంది
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: అంగన్వాడి ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మె తగ్గేదే లేదు మరింత ఉధృతం చేస్తామని వ్యకాస జిల్లా నాయకులు పి,పక్కీర్ సాహెబ్,ఓబులేష్,సిఐటియు మండల నాయకులు వెంకట శివుడు,పి.లింగస్వామి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.బుధవారం రెండవ రోజు సమ్మె సందర్భంగా స్థానిక బస్టాండ్ సర్కిల్లో అంగన్వాడి వర్కర్స్ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించేంతవరకు వెనక్కు తగ్గేది లేదని రోజుకో రూపంలో ఆందోళనలు మరింత ఉదృతం చేస్తామన్నారు.అంగన్వాడి వర్కర్స్ తమ సమస్యల పరిష్కారం కోసం రెండు రోజులుగా నిరవదిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదన్నారు.ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఎమ్మెల్యేల ఇండ్లు దిబ్బంధం చేస్తామని డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తుంటే ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరిస్తుందని కనీస వేతనం 26వేలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి సిబ్బంది యూనియన్ నాయకులు భువనేశ్వరి, ఉమాదేవి,శైలజ,పుల్లమ్మ, జయమ్మ,తయారూన్,రాధిక,నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.