గ్రీన్‌సిటీ.. అందరి బాధ్యత
1 min read– నగర మేయర్ బీవై రామయ్య
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: న్యాయ రాజధానిగా రూపుదిద్దుకుంటున్న కర్నూలు నగరాన్ని గ్రీన్ సిటిగా మార్చేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కర్నూలు నగర మేయర్ బి.వై రామయ్య పిలుపునిచ్చారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ మీటింగ్ హాల్లో క్రేడాయ్ సంస్థ బిల్డర్స్ తో మరియు ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ నిర్వాహకులతో కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య , కమిషనర్ డి.కే బాలాజీ ఆధ్వర్యంలో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు. దివంగత నేత వైఎస్సార్ జయంతిన ప్రతివార్డులో 50వేల మొక్కలు నాటడం, వాటి పర్యవేక్షించడం తదితర అంశాలపై చర్చించారు. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని కమిషనర్ డీకే బాలాజి తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వర్, మునిసిపల్ స్కూల్స్ సూపర్ వైజర్ త్యాగరాజు, ఆర్ఐ వాజీద్, తదితరులు పాల్గొన్నారు.