ఎకరాకు 50 వేల పరిహారం ఇచ్చి కరవు రైతులను ఆదుకోవాలి
1 min readవరుస కరువులతో జిల్లా ప్రజలు త్రీవ నష్టాన్ని చవి చూశారు.కరువు రైతులను, కూలీలను ఆదుకోవాలని కేంద్ర కరువు బృందానికి ఆంధ్రప్రదేశ్ రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల విజ్ఞప్తి.
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ : రాష్ట్రంలో కర్నూలు జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతం వరుసగా కరువులు అతివృష్టి, అనావృష్టితో రైతుల, కూలీల పరిస్థితి చాలా దారుణంగా ఉన్న ప్రాంతం, వేలకు వేలు పెట్టుబడులు పెట్టి కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా తిరిగి రాక ప్రకృతి నిరాదరణకు పాలకుల నిర్లక్ష్యంనికి, దారిద్రాన్ని అనుభవిస్తున్న ప్రాంతం, వరుస కరువులు గురవుతున్న మండలం దేవనకొండ కావున ప్రభుత్వము కరువు బారిన పడి చిక్కి శల్యమైన ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి వీర శేఖర్ కేంద్ర సహాయక బృందానికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర కరువు బృందం జిల్లా పర్యటన నేపథ్యంలో దేవనకొండ మండలంలోని కప్పట్రాళ్ల నెల్లిబండ గ్రామాల మధ్య ఏర్పాటు చేసిన శిబిరం దగ్గర రైతు ,వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు మండలంలో రైతన్న ల స్థితి పైన అదేవిధంగా ప్రజల కూలీల బాధలపైన వివరిస్తూ, ఈ సందర్భంగా వీరశేఖర్, రైతు సంఘం మండల కార్యదర్శి సూరి సిఐటియు మండల కార్యదర్శి అశోక్ లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాలుగా తీవ్రమైన కరువు పరిస్థితులు కర్నూలు జిల్లా దేవనకొండ మండలం లో నెలకొన్నాయని అన్నారు . ఈ ప్రాంతంలో వేరుశనగ, పత్తి, మిరప, ఆముదము, సజ్జ, కోర్ర,జొన్న, కందులు, మిరప, ఉల్లి వంటి ఆహార పంటలు మరియు వాణిజ్య పంటలు సాగు చేసుకుంటారునీ, ఈ సంవత్సరము ఖరీఫ్ సీజన్లో మూడంటే మూడే వానలు కురిసి అత్యంత తక్కువ వర్షపాతం దేవనకొండ మండలంలో నమోదు అయిందని తెలిపారు. రైతులను ప్రకృతి నట్టేట ముంచిందని గత సంవత్సరం కరువు ఈ సంవత్సరం కరువు వచ్చిందని సాగు మీద ఆశతో వేరే ప్రత్యమ్నాయం లేక వేలకు వేల పెట్టుబడులు పెట్టి రైతన్న కుదేలు అయ్యాడ డని, అప్పుల పాలవుతున్నారని వ్యవసాయానికి చేసిన అప్పులు తీర్చలేక అప్పుల వాళ్ళకి సమాధానం చెప్పలేక ముఖం చూపించలేక ఆత్మాభిమానంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు చోటు చేసుకున్నాయని తెలిపారు. ప్రభుత్వం కరువు మండలంగా కూడా ప్రకటించింది అయితే రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలుగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం కరువు పరిహారం ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నామని పేర్కొన్నారు. ఆ విధంగా ఇచ్చినట్లయితే రైతులకు కొంతలో కొంతైనా ఆదుకున్న వాళ్లు అవుతారని అదేవిధంగా ఉపాధి లేక తీవ్రమైనటువంటి వలసలు ఉన్న ప్రాంతం దేవనకొండ మండలం వెంటనే ఈ ప్రాంతంలో ఉపాధి పనులు కల్పించి వలసల నుండి ఆపాలని సరైన వేతనం పనిచేసిన వెంటనే వేతనం ఇవ్వాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు.ఈ సందర్భంగా పలు డిమాండ్లతో వినతి పత్రాన్ని కరువు బృందానికి అందజేశారు.కరువు వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 50 వేల పరిహారం ఇవ్వాలని,రాబోయే ఖరీఫ్ సీజన్ కు ఎరువులు విత్తనాలు ఉచితంగా రైతు లకు ఇచ్చి చేయూతనివ్వాలని,200 రోజులు పని కల్పించి 600 రూపాయల వేతనం ఇవ్వాలని,బ్యాంకుల్లోని అన్ని రకాల రుణాలను మాఫీ చేయాలి,పశువులకు పశుగ్రాసాన్ని సరఫరా చేయాలని వారు కోరారు వినతి పత్రం ఇచ్చిన వారిలో వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మహబూబ్ బాషా ప్రజా సంఘాల నాయకులు పాండు, వీరన్న, రసూల్, వీరేంద్ర తదితరులు పాల్గొన్నారు.