విద్యార్థుల ప్రతిభను ఆవిష్కరించిన సైన్స్ ఫెయిర్
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పత్తికొండ ప్రభుత్వ బాలురు ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన మండల స్థాయి సైన్స్ ఫెయిర్ విద్యార్థుల ప్రతిభను ఆవిష్కరించింది. విద్యార్థులు సొంత పరిజ్ఞానంతో తయారుచేసిన నూతన ఆవిష్కరణలు వారి ప్రతిభకు తార్కాణాలుగా నిలిచాయి. మండల స్థాయిలో ఏర్పాటుచేసిన సైన్స్ ఫెయిర్ నందు వ్యక్తిగత మరియు సమూహ కేటగిరీల కింద ప్రదర్శించారు. మండలాల్లోని వివిధ మండలాల నుండి ప్రదర్శించిన మొదటి స్థానంలో నిలిచిన ఆవిష్కరణలను సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శించారు. మండల స్థాయిలో ఎంపికైన ప్రాజెక్టులను ఒక్కో పాఠశాల నుండి ఒక్కో క్యాటగిరీకి ఎంపికైన ప్రాజెక్టులను సైన్స్ ఫెయిర్ లో ప్రదర్శించినట్లు ఎంఈఓ రమేష్ తెలిపారు. అలాగే టాప్ త్రీ లో ఎంపికైన ప్రాజెక్టులను జిల్లా స్థాయికి ఎంపిక చేయబడతాయని ఆయన చెప్పారు. పాఠశాల ఇన్చార్జి హెడ్మాస్టర్, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ మధుబాబు, ఆయా పాఠశాలల సైన్సు ఉపాధ్యాయులు ప్రాజెక్టులను తమ పరిజ్ఞానంతో తయారుచేసిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొని ఆవిష్కరణల ప్రాధాన్యతను తెలియజేశారు.