PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వృద్ధుల పట్ల జాలి, దయా గుణాలను కలిగి ఉండాలి 

1 min read

 పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: నిరాదరణకు గురైన వృద్ధుల పట్ల ప్రతి ఒక్కరు జాలి దయా గుణాలను కలిగి ఉండాలని అడ్వకేట్ ఉప్పర నాగరాజు సూచించారు సూచించారు. ఆయన కూతురు జన్మదిన వేడుకలను పత్తికొండ పట్టణంలోని హోసూర్ రహదారిలో ఉన్న రూరల్ ట్రైబల్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వహిస్తున్న (ఆర్టిడిఎస్) వృద్ధాశ్రమంలో వృద్ధుల నడుమ జరుపుకున్నారు. ఈ సందర్భంగా వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. పత్తికొండ యువ స్పందన సొసైటీ సెక్రటరీ, అడ్వకేట్ ఉప్పర నాగరాజు  కుమార్తె ఉప్పర మిథాక్షి సాగర్ మొదటి జన్మదినం  సందర్భంగా  వృద్ధుల నడుమ జన్మదిన కేక్ కట్ జన్మదిన వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ, తన కూతురు మిథాక్షి సాగర్ మొదటి జన్మదిన వేడుకలను వృద్ధాశ్రమంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగరాజు సతీమణి నాగమణి, కుటుంబ సభ్యులు, వృద్ధాశ్రమం సిబ్బంది రంగమ్మ, వృద్ధులు తదితరులు పాల్గొన్నారు.

About Author