జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించండి
1 min readజాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య
పల్లెవెలుగు వెబ్ కర్నూల: జిల్లాలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య ఎపిఎస్పీడీసీఎల్ అధికారులను అదేశించారు.గురువారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ లో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్ల ను జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ జిల్లాలో డిసెంబర్ 14 వ తేదీ నుండి 20 వ తేదీ వరకు నిర్వహించే జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని ఎపిఎస్పిడీసీఎల్ అధికారులను ఆదేశించారు. నేటి సత్ సంకల్పం రేపటి వెలుగుకు సహకారం అవుతుందన్నారు. విద్యుత్ పొదుపుతో ఇంధనం ఆదా అవుతుందని అందుకు గాను ఇంధన పరిరక్షణ కొరకు ఎల్ఈడి బల్బ్ ల వాడకం గురించి, కరెంట్ ఇస్త్రీ పెట్టెల వాడకం, ఎక్కువ స్టార్ లు వున గృహోపకరల వాడకం తదితర వాటి గురించి ప్రజలకు తెలియచేసి విద్యుత్ ను పొదుపుగా వాడే విధంగా ప్రజలకు ఈ వారోత్సవాల్లో అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.కార్యక్రమంలో ఏపీఎస్పిడీసీఎల్ ఎస్ఈ ఉమాపతి, ఈఈ లు ఓబులేసు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.