PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రీ సర్వే ప్రక్రియ ను త్వరితగతిన పూర్తి చేయాలి

1 min read

గోదాముల నిర్మాణంలో కర్నూలు జిల్లా అగ్రగామి…

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి…

పల్లెవెలుగు వెబ్  కర్నూలు: రాష్ట్రంలో మూడో దశ రీ సర్వే కు సంబంధించి గ్రౌండ్ ట్రూత్, గ్రౌండ్ వాల్యుయేషన్ త్వరగా పూర్తి చేయాలని, ఫైనల్ ఆర్ ఓఆర్ సిద్ధం చేయాలని , స్టోన్ ప్లాంటేషన్లు కూడా వెంటనే పూర్తి చేసే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి ఆదేశించారు.గురువారం ఉదయం విజయవాడ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్ , జాయింట్ కలెక్టర్ ల తో వివిధ ప్రభుత్వ పథకాల అమలుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు. జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మరియు జిల్లా అధికారులు మినీ కాన్ఫరెన్స్ హాల్ నుండి ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనులు నిమిత్తం ఇవ్వవలసిన భూములు అవార్డు పాస్ అయిన వెంటనే వారికి అప్పజెప్పాలని ఆదేశించినారు.  ప్రభుత్వ గోదాముల నిర్మాణాలలో రాష్ట్రంలో కర్నూలు , పల్నాడు , నంద్యాల , అనంతపురం జిల్లా లు ముందు వరుసలో ఉన్నాయని అభినందించారు. ఈ విధంగా మిగతా జిల్లాలు కూడా చొరవ తీసుకోవాలని ఆదేశించినారు.  150 జన ఔషధీ కేంద్రాల  ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.గతవారం  మాచంగ్ తుఫాను వల్ల నష్టపోయిన పంటల వివరాలు పూర్తిగా సేకరించాలని, నష్టపోయిన రైతులకు వెంటనే ఉచితంగా విత్తనాలు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని కొనే ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.జగనన్న పాల వెల్లువ స్కీమ్ కొరకు డిసిసిబి ద్వారా ఆధార్ కార్డు , మొబైల్ సౌకర్యం వినియోగించుకుని కేవలం అరగంటలో లోన్ ఇప్పించే చర్యలు త్వరలో చేపట్టనున్నట్లు ప్రధాన కార్యదర్శి తెలియజేశారు. ఈ మొబైల్ యాప్ ద్వారా పాడి పరిశ్రమకు విరివిగా లోన్లు ఇప్పించి పాల ఉత్పత్తి అభివృద్ధి కి కలెక్టర్లు కృషిచేయాలని ఆదేశించారు.ప్రధానమంత్రి జన జాతి ఆదివాసి న్యాయ మహా అభియాన్ (ప్రధానమంత్రి  జన్ మాన్) పథకం ద్వారా ఆదివాసీలకు  ఇల్లు నిర్మించు కార్యక్రమము అమలు అయ్యేలా చూడాలన్నారు.ప్రస్తుతము  రెండవ దశ లో ఉన్న 4.18 లక్షల గృహాల ఇళ్లు ఫిబ్రవరి మొదటి వారానికి పూర్తి కావాలని , ఈ విషయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు పూర్తి బాధ్యత వహించి ఇళ్ళ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు.వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించడం లో దేశంలో ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో ఉన్నదని , ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అవసరమైన ప్రజలకు అందించే చర్యలు చేపట్టాలని తెలియజేశారు.నిర్మాణాలు పూర్తి చేసుకున్న వైయస్సార్ హెల్త్ క్లినిక్ , రైతు భరోసా కేంద్రాలు , గ్రామ సచివాలయ భవనాలు వెంటనే సంబంధించిన శాఖలకు అప్పజెప్పే చర్యలు చేపట్టాలని ఆదేశించినారు.ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశానికి జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య , డిఆర్ఓ మధుసూదన్ రావు , జిల్లా పరిషత్ సీఈవో , ఎస్ ఈ పంచాయతీరాజ్ , ఎస్ ఈ  ఆర్ డ బ్ల్యూ ఎస్ , జిల్లా వ్యవసాయ అధికారి , జిల్లా పశుసంవర్ధక అధికారి , ఉద్యాన శాఖ అధికారి ,సర్వే అధికారులు , హౌసింగ్ తదితర అధికారులు పాల్గొన్నారు.

About Author