ఉదృతం అవుతున్న అంగన్వాడి ఉద్యమం..
1 min readపల్లెవెలుగు వెబ్ పాణ్యం : పాణ్యం మండలం లో అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నాలుగవ రోజు సమ్మెలో భాగంగా స్థానిక మార్కట్టి యార్డు వద్ద నుంచి భారీ ప్రదర్శన నిర్వహించి ఎంపీడీవో ఆఫీస్ వరకు నిర్వహించారు ఈ కార్యక్రమానికి అంగన్వాడి వర్కర్స్ హ్యాండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు వెంకటమ్మ. అధ్యక్షత నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నంది విజ్ఞాన కేంద్రం జిల్లా కన్వీనర్ రామరాజుహాజరై వారు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని అనేక దశలవారీగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఇంతవరకు పరిష్కారం చేయలేదని అందుకు రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో సమ్మెబాట పట్టడం జరుగుతుందని అందులో భాగంగా . మీ సమస్యలు సంపూర్ణంగా పరిష్కారం అయ్యేందుకు మీరు చేసే ఉద్యమంలో మీ వెంట ఉంటుందని తెలిపారు మీ యొక్క న్యాయమైన డిమాండ్లు అంగనవాడి లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తెలంగాణ కన్నా అదనంగా వేతనాలుపెంచాలని. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాండ్ డ్యూటీ ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ 50 లక్షలు ఇవ్వాలని వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని ప్రీ స్కూల్ బలోపేతం చేయాలని అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయాలని హెల్పర్ ప్రమోషన్లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలని ప్రమోషన్ లో రాజకీయ జోక్యం అరికట్టి వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని అంగన్వాడీ పిల్లలకు అమ్మ ఒడి యూనిఫామ్ ఇవ్వాలని వైయస్సార్ సంపూర్ణ పోషణ మెన్ చార్జిపెంచాలని గ్యాస్ .ప్రభుత్వమే సరఫరా చేయాలని. 2017 నుండి పెండింగ్ లో ఉన్న పీఏ బిల్లులు ఇవ్వాలని లబ్ధిదారులకు న్యాయమైన ఆహారాన్ని సరఫరా చేయాలని ఆయిల్ కందిపప్పు పెంచాలని సీనియార్టీ ప్రకారం వేతనాలు ఇవ్వాలని సూపర్వైజర్ పోస్టులకు వయోపరిమితి తొలగించాలని సర్వీస్ లో ఉండీ చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి ని.బీమా అమలు చేయాలని ఈ న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేయని యెడల అంగన్వాడీల సత్తా ఏంటో చూపిస్తామని వారు హెచ్చరించారు . అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవోకు అందజేయడం జరిగినది.ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల అంగనవాడి టీచర్ ఆయాలు సిఐటియు మండల కార్యదర్శి కే భాస్కర్ .విద్యార్థి సంఘం నాయకులు ప్రతాప్ వెంకటమ్మ .స్వరూప మరియమ్మ .ప్రభాతమ్మ లలితమ్మ . అనసూయ లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.