‘సిద్ధేశ్వరం అలుగు’ కోసం.. ఉద్యమం
1 min readపల్లెవెలుగు వెబ్, నందికొట్కూరు: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయిందని, నేటికీ రాయలసీమ జిల్లాలకు ఒక్క ప్రాజెక్టు కూడా నిర్మించలేదని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ నాయకులు మజీథియా, మౌలాలి, సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి వెంకటేశ్వర్లు, డివిజన్ కార్యదర్శి గోపాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం సిద్ధేధ్వరం అలుగు నిర్మించాలని డిమాండ్ చేస్తూ… రైతు సంఘాలు, వామపక్షాల నేతృత్వంలో ఆందోళన కార్యక్రమం చేశారు. అలుగు నిర్మించకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
అనంతరం శిలాఫలకం ఏర్పాటు చేశారు. రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం సిద్దేశ్వరంఅలుగు నిర్మాణం కార్యరూపం దాల్చలేదని, ఇది ఈ ప్రాంత నాయకుల చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన నాయకురాలు ఎస్ బి బి రాధమ్మ, నాగన్న, పీవోడబ్ల్యూ నాయకురాలు మాణిక్యమ్మ, సూరి బి తదితరులు పాల్గొన్నారు.