PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

హామీలు అమలు అయ్యేంతవరకు ఉద్యమం ఆగదు..

1 min read

అంగన్వాడి వర్కర్స్ యూనియన్ సిఐటియు,

పల్లెవెలుగు వెబ్ గడివేముల : గడివేముల సీఎం జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికల్లో అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా వేతనాలు ఇస్తానన్న సీఎం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నాడు ఐదో రోజు తమ నిరవధిక నిరసన దీక్షను కొనసాగించారు , అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ అధ్వర్యంలో అంగన్వాడి యూనియన్ మండల నాయకులు, అధ్యక్ష కార్యదర్శులు గూడ వసంతలక్ష్మి,.రామ చెన్నమ్మ  .రాములమ్మ. మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం  సమ్మెబాట చేపట్టామని తెలిపారు, ఈ సందర్భంగా అంగన్వాడి కార్మికుల సమస్యలను పరిష్కారం కోసం నాలుగున్నర సంవత్సరాలుగా ప్రభుత్వానికి విజ్ఞాపన పత్రాలు అందజేయడం శాంతియుత నిరసనలు,ధర్నాలు, అనేక రూపాల్లో హక్కుల కోసం పోరాటాలు చేయడం జరిగిందని, అంగన్వాడీలకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ .కనీస వేతనాలు పెంచాలని, ఆరు నెలల నుంచి బకాయి పడ్డ సెంటర్ అద్దెలు టి ఏ బిల్లులు తక్షణమే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు, ఆయాలు ప్రధానోతూలు వయోపరిమితి 50 సంవత్సరాలు పెంపుదల, రాజకీయ జోక్యాన్ని నివారించాలని, మినీ వర్కర్లను మెయిన్ వర్కర్ గా గుర్తించి వేతనాలు ప్రమోషన్లు కల్పించాలని వారు అన్నారు మెడికల్ లీవులు సౌకర్యం రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించి అంగన్వాడి వర్కర్స్ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్తామని వారు హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తదితరులు పాల్గొన్నారు.

About Author