సాధసీదాగా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర..
1 min readపెద్ద ఎత్తున పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు..
పల్లెవెలుగు వెబ్ పెదపాడు : పాతముప్పారులో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అధికారులు సాధసీదాగా నిర్వహించారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్రకు సభందించి దూరదర్శిన్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోడీ సందేశం గ్రామస్థులకు చూపించాలని అధికారులు విస్తృతంగా ముందస్తు ఏర్పాట్లు చేసారు. అయితే ఎం.యల్.సీ షేక్ బాబ్జి అకాల మరణంతో కలెక్టర్ ఆదేశాలుతో జిల్లాలో రెండు రోజులు పాటు సంతాప దినాలు ప్రకటించడంతో అధికారులు వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర కార్యక్రమాన్ని సాధసీదాగా జరిపించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస విశ్వనాధ్ మాట్లాడుతూ కేంద్ర పథకాలపై ప్రజలకు అవగాహన ఉండాలన్నారు. జిల్లాలో నవంబర్ 24 నుంచి ప్రారంభమైన యాత్ర ప్రతి రోజు పది గ్రామాలలో జరుగుతుందని అన్నారు. జిల్లాలో 169 గ్రామాలలో సంకల్ప్ యాత్ర జరగగా సుమారు 80000 మంది యాత్రలో పాల్గొన్నారని డీపీఓ శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ, ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, మండల వ్యవసాయ అధికారి, మండల విద్యాశాఖ అధికారి, పంచాయతీ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.