300బస్తాలు… సిమెంట్ వితరణ
1 min read
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలం లోని దౌలాతాపురం( షుగర్ ఫ్యాక్టరీ) గ్రామంలో నిర్మిస్తున్న శ్రీ సీతారామ ఆలయానికి కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి తనయులు, చింతకుంట్ల జెడ్పిటిసి పోచం రెడ్డి నరేన్ రామాంజనేయులు రెడ్డి 300 బస్తాలు సిమెంట్ విరాళం అందించినట్లు షుగర్ ఫ్యాక్టరీ వైఎస్ఆర్సిపి నాయకులు నాగినేని వెంకటరమణ, సౌ రెడ్డి శ్రీకాంత్ రెడ్డి, కరుణాకర్, మహేష్ రెడ్డిలు తెలిపారు, శనివారం సాయంత్రం వారు విలేకరులతో మాట్లాడుతూ, రామాలయ నిర్మాణానికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని పోచం రెడ్డి నరేన్ రామాంజనేయులు రెడ్డిని అడుగగా ఆయన సహృదయ ఎంత స్పందించి వెంటనే తొలి దశలో 100 బస్తాలు అందించడం జరిగిందన్నారు, తదుపరి పనుల పురోగతిని బట్టి మిగతా 200 బస్తాలు ఇవ్వడం జరుగుతుందని వారు తెలియజేశారు, ఈ సందర్భంగా గ్రామ ప్రజల తరఫున వారు నరేంద్ర రామాంజనేయులు రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.