మహానంది.. కృష్ణ నంది అటవీ ప్రాంత లో ప్లాస్టిక్ నిషేధం
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది మరియు కృష్ణ నంది క్షేత్ర ల పరిధిలోని నల్లమల అడవి ప్రాంతం చుట్టుపక్కల జనవరి ఒకటో తారీకు నుండి ప్లాస్టిక్ వస్తువులను నిషేధిస్తున్నట్లు ఎఫ్ ఆర్ ఓ దినేష్ కుమార్ రెడ్డి మహానందిలో పేర్కొన్నారు. నల్లమల అడవి ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ పుణ్యక్షేత్రాలు కావడంతో భక్తులు విరివిగా స్వామి మరియు అమ్మవార్లను దర్శించుకోవడానికి వస్తూ ఉంటారని అలాంటి సమయాల్లో తమ వెంట తెచ్చుకున్న తిను బండారాలను ఇతర వస్తువులను ప్లాస్టిక్ కవర్లు, సంచుల్లో తీసుకొని వచ్చి క్షేత్ర ల సమీపంలోని చుట్టుపక్కల ఉన్న అటవీ ప్రాంతంలో పడవేస్తూ ఉన్నారని తెలిపారు. ఇలాంటివి వన్యప్రాణు లు తినడం వల్ల వాటి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందన్నారు. దీంతోపాటు ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసి పోవడానికి కొన్ని సంవత్సరాలు కాలం పడుతుంది అన్నారు. అడవి ప్రాంతంలో ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకపోవడం వల్ల వర్షపు నీరు భూమిలో ఇంకిపోకుండా వాగులు వంకల ద్వారా నిరుపయోగంగా పోతుంది అన్నారు. అంతేకాక ఇలాంటి ప్లాస్టిక్ వ్యర్థాలని వర్షాకాలంలో వాగులు వంకల ద్వారా కొట్టుకొని వచ్చి వరద నీరు గ్రామాలను పట్టణాలను ముంచెత్తడంతోపాటు కాలువలు చెరువులు తెగిపోయిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయని ఎఫ్ఆర్ఓ దినేష్ కుమార్ రెడ్డి తెలిపారు. నల్లమల అడవి ప్రాంతంలోని అనుకోని ఉన్న ఆయా క్షేత్రాల అధికారులు కూడా నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను వినియోగించకుండా స్థానిక వ్యాపారులను ఆదేశించాలని డిస్ప్లే బోర్డులు కూడా ఏర్పాటుచేసి భక్తులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు .జనవరి ఒకటో తారీకు నుండి నల్లమల అడవి ప్రాంతంలోని సమీపంలో ఉన్న క్షేత్రాల్లో నీ ప్రాంతాల్లో విచక్షణారహితంగా ప్లాస్టిక్ నిషేధిత వస్తువులను వినియోగిస్తూ అటవీ ప్రాంత చుట్టుపక్కల ప్రాంతాల్లో పరవేస్తూ పర్యావరణానికి మరియు వన్యప్రాణులకు హాని జరిగేలా ప్రవర్తిస్తే జరిమానాలతోపాటు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నల్లమల అటవీ ప్రాంతం లోని క్షేత్రాల్లో ముఖ్యంగా హోటల్ నిర్వాహకులు , తినుబండారాలు విక్రయించే వ్యక్తులు మరియు సమూహాలుగా వచ్చే భక్తులు నిషేధిత ప్లాస్టిక్ వ్యర్థాలను నల్లమల అటవీ ప్రాంతం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అలాంటి వారిపై చర్యలు తప్పవని ఎఫ్ఆర్ఓ దినేష్ కుమార్ రెడ్డి తెలిపారు.. ఈ కార్యక్రమంలో ఆయన వెంట డిఆర్ఓ హైమావతి గార్డ్ ప్రతాప్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
ప్లాస్టిక్, ఎఫ్ఆర్ఓ, వర్షకాలం,