అంగన్వాడిల… న్యాయవాదుల దీక్షలకు మహిళా కాంగ్రెస్ సంఘీభావం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: అంగన్వాడీలు మరియు జిల్లా న్యాయవాదుల సంఘం చేస్తున్న దీక్షలకు జిల్లా మహిళా కాంగ్రెస్ మరియు జిల్లా మహిళా సేవాదళ్ సంఘీభావం తెలియజేశారు. ఆదివారం ధర్నా చౌక్ చేపడుతున్న అంగన్వాడీలకు సంఘీభావం తెలిపిన జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎస్ ప్రమీల మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని, కనీస వేతనం 26,000 ఇవ్వాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, వారికి ప్రమోషన్స్ ఇవ్వాలని, సర్వీసులో ఉండి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, భీమా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా సేవాదళ్ మహిళా అధ్యక్షురాలు ఏ వెంకట సుజాత మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లో పెండింగ్ లో ఉన్న సెంటర్ అద్దెలు, 2017 టీఏ బిల్లులు, ఇతర బకాయిలు వెంటనే ఇవ్వాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా న్యాయవాదుల సంఘం చేపట్టిన దీక్షలకు సంఘీభావం ప్రకటించి ఏపీ భూహక్కుల చట్టం 2022 వెంటనే రద్దు చేయాలని న్యాయవాదులు చేస్తున్న దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పుష్పలీల, ఏ లలిత, నారాయణమ్మ, బి లక్ష్మి, ఈశ్వరి, చిన్న పుల్లమ్మ మొదలగు కాంగ్రెస్ మహిళలు పాల్గొన్నారు.