విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు సేవా కార్యక్రమాలకు ముందుకు రావాలి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆల్ ఇండియా పెన్షనర్స్ డే ను పురస్కరించుకుని కలెక్టర్ కార్యాలయంలో ఉన్న విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా పెన్షనర్స్ డే ను నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగస్తుల హక్కుల కోసం పోరాడిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి స్వర్గీయ డి.ఎస్ నకార చిత్రపటానికి మొదట విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు మరియు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న లయన్స్ జిల్లా అడిషనల్ క్యాబినెట్ సెక్రటరీ లయన్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గంగాధర్ రెడ్డి విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు రిటైర్డ్ ఎమ్మార్వో మురళి శంకరప్ప, జిల్లా సెక్రటరీ ఎం.ఎల్ నరసయ్య, జిల్లా కోశాధికారి కె. వెంకటస్వామి, విశ్రాంత ఉద్యోగుల అర్బన్ యూనిట్ సంఘ అధ్యక్షులు భీమా ఎల్లా గౌడ్, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, కార్యదర్శి జి .రమణ కోశాధికారి కె. ఎన్ రెడ్డి ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.అనంతరం ఆల్ ఇండియా పెన్షనర్స్ డే ని పురస్కరించుకొని ఇటీవల తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ లో మెడల్స్ సాధించిన ఎం.ఎల్ నరసయ్య ,కే .వెంకటస్వామి లను ఘనంగా సత్కరించారు.