మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబాలకు అండగా ఉంటాం.. జిల్లా ఎస్పీ
1 min readజిల్లా ఎస్పీ డి మేరీ ప్రశాంతి
బాధిత కుటుంబ సభ్యులకు చెక్కును అందజేసిన అదనపు ఎస్పి అడ్మిన్ఎం జె వి భాస్కరరావు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : మరణించిన పోలీస్ సిబ్బంది కుటుంబాల వారికి ఎల్లవేళలా అండగా ఉంటామని ఏలూరు ఎస్పీ డి మేరీ ప్రశాంతి ఐపిఎస్ అన్నారు.ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ లో వినాయక నిమగ్నం విధులు నిర్వహిస్తున్న సమయంలో దుండగుడు వెనక నుండి దాడి చేసిన దానిపై ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ గంధం నరేంద్ర మరణించిన నేపథ్యంలో వారికి పోలీస్ డిపార్ట్మెంట్ నుండి రాబడిన కార్పస్ ఫండ్ 100,000 రూ.లు చెక్ ను గంధం నరేంద్ర యొక్క సతీమణి కీ ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ ఎం జె వి భాస్కర రావు చెక్కును అంద చేసినారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ వారి కుటుంబం యొక్క యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. మరణించిన పోలీస్ సిబ్బంది పోలీస్ శాఖలో లేనప్పటికీ వారి కుటుంబ సభ్యులైన మీరంతా పోలీస్ శాఖలో భాగమని, వారికి ప్రభుత్వం నుండి రావాల్సిన అన్ని బెనిఫిట్స్ లను త్వరితగతిన వచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఏదైనా సమస్య ఉన్న నేరుగా తనను కలవవచ్చని, పోలీసు శాఖ వారికి అండగా నిలుస్తుందని అదనపు ఎస్పీ అడ్మిన్ వారికి భరోసా కల్పించారు. పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ చనిపోయిన పోలీసు సిబ్బంది కుటుంబాల సంక్షేమంకు అన్ని చర్యలు తీసుకొని వారికి అన్నీ విధాల అండగా ఉంటాము అని అదనపు ఎస్పీ అడ్మిన్ భాస్కర్ రావు తెలిపారు.