విజయవాడ అంటే నాకెంతో ఇష్టం…
1 min readయునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో జబర్థస్త్ ఫేమ్ అనసూయ బరద్వాజ్
పల్లెవెలుగు వెబ్ విజయవాడ: విజయవాడ అంటే తనకు చాలా ఇష్టమని, ఇక్కడి ప్రజలు ఎంతో మంచివారని సినీ నటి, జబర్థస్త్ ఫేమ్ అనసూయ బరద్వాజ్ అన్నారు. మహాత్మాగాంధీ రోడ్డులోని బెంజిసర్కిల్ సమీపంలో ఉన్న సబ్ రిజిస్టార్ ఆఫీసు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ రెస్టారెంట్‌ను సోమవారం ఉదయం అనసూయ బరద్వాజ్ ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తనను చూసేందుకు భారీగా తరలి వచ్చిన అభిమానులతో ఆమె కొద్దిసేపు ముచ్చటించి సందడి చేశారు. తనకు ఆకు కూరలంటే ఎంతో ఇష్టమని చెప్పారు. రాజమండ్రి వారి ఒరిజినల్ రోజ్ మిల్క్ ఇకపై యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ రెస్టారెంట్లో లభిస్తుందని పేర్కొన్నారు. తన చిత్రాలను ఆదరిస్తున్న అభిమానులకు ఆమె కృతజ్ఞతలు చెబుతూ తనపై చూపుతున్న అభిమానానికి తాను ఎప్పుడూ రుణపడి ఉంటానన్నారు. కొత్తగా ప్రారంభించిన యునైటెడ్ ఫుడ్ ప్యాలెస్ రెస్టారెంట్లో సరికొత్త వెజ్, నాన్‌వెజ్ రుచులను ఆస్వాదించాలని అందరికీ అందుబాటు ధరల్లో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎల్.ప్రశాంత్‌కుమార్, ఎల్.శ్రీదేవిలను అనసూయ బరద్వాజ్ అభినందించారు. రెస్టారెంట్ నిర్వాహకులు వారి కుటుంబ సభ్యులతో కలిసి రెస్టారెంట్లో విందు ఆరగించారు. అభిమానుల కోరిక మేరకు తాను నటించిన చిత్రాల్లోని పాటలకు స్టెప్పులు వేసి డైలాగులు చెబెతూ కొద్దిసేపు సందడి చేశారు. రెస్టారెంట్లో కళ్ళు చెదిరేలా రూపొందించిన ఇంటీరియర్ డెకరేషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.