కేంద్రీయ విద్యాలయంలో… వార్షిక క్రీడాదినోత్సవం..
1 min readగెలుపోటములు సమానంగా స్వీకరించాలి
- క్రీడాకారులకు సూచించిన ప్రముఖ గ్యాస్ర్టో ఎంటరాలజిస్ట్ డా. శంకర్ శర్మ
కర్నూలు: నంద్యాల చెక్పోస్ట్ నందు గల కేంద్రీయ విద్యాలయ కర్నూలు నందు వార్షిక క్రీడా దినోత్సవంలో భాగంగా ఖోఖో , కబడ్డీ, వాలీబాల్, బాస్కెట్ బాల్, రన్నింగ్ రేస్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ శంకర శర్మ మాట్లాడుతూ విద్యార్థులను మరియు క్రీడాకారులను గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలన్నారు. క్రీడాస్ఫూర్తితో విద్యార్థులు పాల్గొనాలని క్రీడలు యోగ మరియు ధ్యానములు శారీరక మరియు మానసిక దారుఢ్యాన్ని పెంపొందిస్తాయని కావున ప్రతి ఒక్కరూ వాటిని దినచర్యగా పాటించాలని తెలిపారు. విద్యార్థులకు గాని పాఠశాలలో గాని ఏదైనా సహాయ సహకారన్ని అందించడానికి తను ఎల్లవేళలా అందుబాటులో సుముఖంగా ఉంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ పాయల్ ప్రియదర్శిని, వ్యాయామ ఉపాధ్యాయుడు బాధలు, స్పోర్ట్స్ కోచ్ వజ్ర రాజు మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొని క్రీడా దినోత్సవాన్ని విజయవంతం చేశారు.