ఘనంగా సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు పత్తికొండలో వైఎస్ఆర్ అభిమానులు ఘనంగా జరుపుకున్నారు.ఏపీ.సీఎం.జగన్మోహన్ రెడ్డి జన్మదినo పురస్కరించుకొని పత్తికొండలో పోచిమి రెడ్డి సేవాదళ్ సంస్థ అధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టింది.ముందుగా పట్టణంలోని చక్రాల రాస్తా సర్కిల్ వద్ద వున్న వైయస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళలర్పించారు. అనంతరం పోచిమి రెడ్డి సేవాదళ్ సంస్థ వ్యవస్థాపకులు మురళీధర్ రెడ్డి వైఎస్ఆర్ అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.అలాగే స్థానిక శారద వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మురళి ధర్ రెడ్డి మాట్లాడుతూ,వైఎస్.జగన్మోహన్ రెడ్డి పాలన ప్రజా రంజకంగా కొనసాగుతుందని, 2024 సం.లో జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి తిరిగి జయకేతనం ఎగుర వేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. పత్తికొండ నియోజకవర్గం లో ఈ నాలుగు సంవత్సరాలు ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టామని తెలిపారు. వివిధ సేవా కార్యక్రమాల ద్వారా నియోజకవర్గ ప్రజలకు చేరువయ్యామని అన్నారు. పత్తికొండ నియోజకవర్గం లో వైఎస్ఆర్సిపి తరఫున ప్రజల నుండి తనకే పూర్తి మద్దతు ఉందని అన్నారు. ఈసారి ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గం నుండి తాను బరిలోకి దిగుతానని ప్రకటించారు. అధిష్టానం నుండి కూడా తనకు మద్దతు ఉందని, ఈ నేపథ్యంలో పత్తికొండ నియోజకవర్గం అసెంబ్లీ సీటు తనకే కేటాయిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 30 ఏళ్లుగా స్థానికంగా ఉంటూ వైఎస్సార్ అభిమానిగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నానని తెలియజేశారు.ఈ సందర్భంలో త్వరలో పత్తికొండ టౌన్ సర్వీస్ నందు ప్రతి మహిళకు ఉచిత బస్సు సర్వీసు నడుపుతామని చెప్పారు. అంతేకాక పోచిమిరెడ్డి సేవాదళ్ సంస్థ నందు సభ్యత్వం ఉన్న ప్రతి మహిళకు 200 రూపాయల గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మున్ముందు పోచిమి రెడ్డి సేవాదళ్ సంస్థ ద్వారా పత్తికొండ నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి, సామాజిక సేవ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు.