ఈ సంవత్సరం బీడీ పొగాకుపై అధిక ధర
1 min readపల్లెవెలుగు వెబ్ మిడుతూరు: గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధికంగా ధర ఉంటుందని జిపిఎల్ అసిస్టెంట్ మేనేజర్ రామ కృష్ణారెడ్డి అన్నారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండలంలోని పైపాలెం, కడుమూరు,కలమందలపాడు తదితర గ్రామాలలో ఫీల్డ్ టెక్నీషియన్ లతో కలిసి ఆయన గ్రామాల్లో వేసిన పొగాకు పంటలను పరిశీలిస్తూ పొగాకు రైతులతో వారు మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం బీడీ పొగాకు ఒక కేజీ 100 రూపాయలకు కొన్నామని ఈ సంవత్సరం వాటికంటే ఎక్కువగానే ధర ఉంటుందని ఆయన తెలిపారు.గాడ్ ఫ్రెయ్ ఫిలిప్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీ వారు బీడీ పొగాకు ఆకు కుట్టడం గురించి వివరిస్తూ బీడీ పొగాకు దోరణాలు గుచ్చటం వల్ల అధిక దిగుబడి పంట మరియు మంచి పోగాకు ధర ఉంటుందని పొగాకును అమ్ముకున్న అయిదు రోజుల్లో డబ్బులు అకౌంట్ లో జమ అవుతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ సూపర్ సర్ వై సుధీర్ కుమార్ రెడ్డి మరియు ఫీల్డ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు.