వివాహిత..వేరొకరితో సహజీవనం..రక్షణ కోసం కోర్టుకు ?
1 min readపల్లెవెలుగు వెబ్: ఒక వివాహిత మరొకరితో సహజీవనం చేయడం హిందూ వివాహ చట్టానికి వ్యతిరేకమని అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చింది. తాము సహజీవనం చేస్తున్నామని, తమ కుటుంబ సభ్యులు దాడి చేయకుండా రక్షణ కల్పించాలని ఆమె హైకోర్టును ఆశ్రయించింది. ప్రశాంతంగా సాగుతున్న తమ సహజీవనానికి తన భర్త, ఇతర కటుంబ సభ్యుల నుంచి ఎలాంటి హాని కలగకుండా చూడాలని కోర్టును కోరింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికీ స్వేచ్చ ఉందని, కానీ అది చట్టంలో పొందుపరిచిన నిబంధనలకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. సహజీవనం చేస్తున్న ఇద్దరికీ 5000 జరిమానా విధించింది. సమాజంలో చట్ట వ్యతిరేక చర్యను ప్రోత్సహిస్తున్న ఇలాంటి చర్యను ఎలా ప్రోత్సహించగలమని ప్రశ్నించింది.