దళితులపై కేసులు ఎత్తివేయడం చారి త్రాత్మక నిర్ణయం
1 min readనవయుగ అంబేద్కర్ సీఎం జగన్ మోహన్ రెడ్డి..
నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికె వరప్రసాదరావు
హర్షం వ్యక్తం చేసిన రాష్ట్ర దళిత నాయకులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు ఎస్సీ మాదిగల పైన మాలలపైన పెట్టిన కేసులను ఎత్తివేస్తూ చారిత్రాత్మకమైన ఈ నిర్ణయం పట్ల ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ లందరూ సీఎం జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు గా ఉంటారని నేషనల్ దళిత జేఏసీ చైర్మన్ పెరికే వరప్రసాదరావు హర్ష వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్ రెడ్డి ని కలిసి నవరత్నాల రథసారథి మెమొంటోని ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించడం అయిందని 20 24 లో ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ బహుజనులు మళ్లీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ని సీఎంగా చేస్తామని తెలిపారు. ఇంగ్లీష్ మీడియం మరియు ఇళ్ల పట్టాలు అడ్డుకున్న చంద్రబాబు అంతం బహుజనుల పంతం అని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లందరూ ఏకగ్రీవంగా ఉన్నారని అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీలు పట్ల కేసులు ఎత్తేసినందుకు దానికి సహకరించిన హోంశాఖ మాత్యులు తానేటి వనిత కి మున్సిపల్ శాఖ మాత్యులు ఆదిమలుపు సురేష్ సాంఘిక సంక్షేమ శాఖ మాత్యులు మెరుగు నాగార్జున ఎంపీ సురేష్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.