జాతి మనుగడ కోసం పీవీరావు అడుగుజాడల్లో నడవాలి
1 min read– అమరవీరుడు పీవీరావుకు అశ్రు నివాళులు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: జాతి మనుగడ కోసం జాతి కోసం పోరాటం చేసిన అమరవీరులు స్వర్గీయ పీవీ రావు అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని నందికొట్కూరు నియోజకవర్గ మాలమహనాడు అధ్యక్షుడు నగేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం నందికొట్కూరు మాలమహానాడు కార్యాలయంలో మాలమహానాడు వ్యవస్థాపకుడు పీవీరావు వర్థంతి సందర్భంగా మాలమహానాడు నాయకులు పీవీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాలమహానాడు తాలూకా అధ్యక్షుడు ఎ.సీ నాగేష్ మాట్లాడుతూ జాతి మనుగడ కోసం ఉద్యోగం వదిలేసి జాతిని ఐక్యం చేసిన మాహానీయులు పీవీ రావు అన్నారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును సుప్రీం కోర్టులో కొట్టి వేయించారన్నారు. ఈ పోరుభాటలో ప్రాణాలు త్యాగం చేసిన త్యాగధనులు అని కొనియాడారు. పీవీరావు బాటలో నడుస్తూ జాతి మనుగడ కోసం ప్రతి ఒక్కరూ క్రుషి చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో సీనియర్ నాయకుడు డాక్టర్ రాజు పట్టణ కార్యదర్శి మనోహర్ జిల్లా యస్సీ.సెల్ అధ్యక్షుడు సగినేల రమణ ధర్మ ప్రతాప్ చంద్రన్న జైపాల్ మరియన్న రాజు దానం మహేష్ తేజ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.