PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సీఎం జగన్ మోహన్ రెడ్డిది  రాక్షస పాలన

1 min read

అంగన్వాడి కార్యకర్తల ఉసురు వైసీపీకి తగులుతుంది

టీడీపీ నేత మాండ్ర శివానంద రెడ్డి

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: రాష్ట్రంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి రాక్షస పాలన సాగుతోందని నంద్యాల టీడీపీ పార్లమెంట్ ఇంచార్జి మాండ్ర శివానంద రెడ్డి విమర్శించారు. నందికొట్కూరు  పట్టణంలో  ఐసిడిఎస్ కార్యాలయం ముందు అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న  సమ్మెకు శుక్రవారం టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇన్చార్జి మాండ్ర శివానందరెడ్డి హాజరై  మద్దతు ప్రకటించారు. అంగన్వాడి కార్యకర్తలు చేసే పోరాటానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా సహకరిస్తుందని, భరోసా ఇచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్న ఈ వైఎస్సార్సీపీ ప్రభుత్వం కనీస వేతనాలు కూడా ఇవ్వకపోవడం దుర్మార్గమని, అంగన్వాడీల ఉసురు ప్రభుత్వానికి తప్పక తగులుతుందని మాండ్ర శివానందరెడ్డి  రాష్ట్ర ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. అంగన్వాడీ ఉద్యోగులు వారి కనీస వేతనం చెల్లించాలని, తెలంగాణలో ఇచ్చే వేతనం కన్నా ఎక్కువ వేతనం ఇస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి  నేడు  పట్టించుకోకపోవడం దారుణం అని, టిడిపి ప్రభుత్వం వచ్చాక అంగన్వాడీల హామీలను నెరవేర్చేవిధంగా చంద్రబాబు నాయుడు  దృష్టికి తీసుకెళ్తామని నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి హామీ ఇచ్చారు.మొదటి రోజు నుండి తమ దీక్షకు మద్దతు తెలుపుతున్న టిడిపి నేతలకు అంగన్వాడీ కార్యకర్తల యూనియన్ నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సి సెల్ ఆర్గనైసింగ్ సెక్రెటరీ జయసూర్య, నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, గిరీశ్వరరెడ్డి, రమేష్ రెడ్డి, ఓబుల్ రెడ్డి, ముర్తుజావలి, జాకీర్ హుస్సేన్, మహేశ్వరరెడ్డి, జమీల్, రసూల్, మల్లికార్జునరెడ్డి, వేణుగోపాల్, శ్రీకాంత్, శ్రీను, కళాకర్, గని, రాజు, రాజన్న, అయ్యరాజు,  కుమార్, హుస్సేన్, సతీష్, భరత్, జయాకర్, తిమ్మారెడ్డి, మాసుం, శేఖర్, రామ్మోహన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

About Author