ఘనంగా జరిగిన గణిత దినోత్సవ వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేములలోని శ్రీ రాజరాజేశ్వరి ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలు శుక్రవారం నాడు నిర్వహించారు .ఈ కార్యక్రమములో విద్యార్థిని విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్స్, గణిత రంగోలిలు, యాక్టివిటీస్ కార్యక్రమాలను నిర్వహించారు . కార్యక్రమమునకు అధ్యక్షత వహించిన పాఠశాల కరస్పాండెంట్ శ్రీ ఎం. రామేశ్వర రావు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థుల గణిత ప్రదర్శన చాలా అద్భుతంగా చేశారని విద్యార్థులకు ప్రశంసించారు. గణితమును గురించి మాట్లాడుతూ సర్వశాస్త్రాలకు తల్లి వంటిది గణితం అటువంటి గణిత శాస్త్రమునకు పుట్టిల్లు భారత దేశము. అంకెలు కనుగొన్నది, గణితములో కీలకమైన సున్నాని కనుగొన్నది భారతీయులే. భారతదేశంలో ఒక్కో మేధావి జన్మించి తమ పూర్వీకుల విజ్ఞానానికి వారసుడుగా ప్రపంచాన్ని అబ్బురపరుస్తుంటారు. అటువంటి గణిత శాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజం, శ్రీనివాస రామానుజ జయంతిని గణిత శాస్త్రముపై ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వము మ్యాథమెటిక్స్ డే గా ప్రకటించింది. రామానుజన్ జీవించింది కొద్దికాలమే అయినా సుమారు 3900 ఫలితాలు రాబట్టాడన్నారు విద్యార్థులకు వివరించారు. తరువాత గణిత ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు ప్రసంగించారు. ప్రాజెక్ట్ వర్క్ చేసిన విద్యార్థిని విద్యార్థులకు శ్రీ ఎం రామేశ్వర రావు బహుమతులు అందజేశారు . ఈ కార్యక్రమములో పాఠశాల A.O ఎం.బి.ఎన్ రాఘవేంద్రరావు , ఎం. కృష్ణకాంత్ అధ్యాపక బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు గణిత దినోత్సవ వేడుకలలో పాల్గొని కార్యక్రమమును విజయవంతం చేశారు.