‘యువగళం నవశకం’ సభ సక్సెస్
1 min readమంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి
మంత్రాలయం, పల్లెవెలుగు: విజయనగరం లో నిర్వహించిన యువగళం నవశకం సభ విజయవంతం కావడంతో వైకాపా నేతల్లో వణుకు ప్రారంభమైందని మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని మాధవరం గ్రామంలో అమర్నాథ్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి ల తండ్రి వీరారెడ్డి ని పరామర్శించి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ యువగళం నవశకం సభ వేదికపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు నందమూరి బాలకృష్ణ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లను చూసి తాడేపల్లి లో ఉండే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇంటి తలుపులు బద్దలైనాయనిఅన్నారు. రాష్ట్రంలో వైకాపా పార్టీని ప్రజలు బై బై చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. వైసిపి అధికారంలోకి వస్తే సహజ వనరుల నిరంతర దోపిడీ కొనసాగుతునే ఉంటుందని, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అందర్నీ మోసం చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు దాడులు పెట్టి రాజారెడ్డి రాజ్యాంగం నడిపిస్తుందని దుయ్యబట్టారు. రానున్న రోజుల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని , రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసుల్లో కచ్చితంగా జైలుకు పోతాడని అన్నారు. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నాయకుడని రానున్న ఎన్నికల్లో 160 అసెంబ్లీ స్థానాలు గెలుస్తామని, 25 ఎంపీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పన్నగ వెంకటేష్ స్వామి, బిసి సెల్ నియోజకవర్గం అధ్యక్షులు మాధవరం అమర్నాథ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, తెలుగు యువత జిల్లా మీడియా కోఆర్డినేటర్ విజయరామిరెడ్డి, తెలుగు యువత పవన్, లక్ష్మారి బండ్రాల నరసింహులు, జెట్టి వీరేష్, తెలుగు యువత మండల అధ్యక్షులు సాయి కుమార్ రెడ్డి, మైనార్టీ నాయకులు అమర్, ఐ టిడిపి చిదానంద తదితరులు పాల్గొన్నారు.