NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ గెలుపునకు..యువత కష్టపడాలి..

1 min read
  • టీడీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్​చార్జ్​ టీజీ భరత్​
  • టీడీపీ తీర్థం పుచ్చుకున్న 22వ వార్డు యువ‌త‌

కర్నూలు, పల్లెవెలుగు:నగరంలోని 22వ వార్డుకు చెందిన యువత టీడీపీ కర్నూలు నియోజకవర్గ ఇన్​చార్జ్​ టీజీ భరత్​ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. టిడిపి బిసి సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజు యాద‌వ్ ఆధ్వర్యంలో వీరు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. టి.జి భ‌రత్ వీరికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంత‌రం టి.జి భ‌ర‌త్ మాట్లాడుతూ వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం యువ‌త క‌ష్టప‌డాల‌న్నారు. టిడిపి వ‌స్తే యువ‌త‌కు మంచి భ‌విష్యత్తు ఉంటుంద‌న్నారు. చంద్రబాబు విజ‌న్ ఉన్న నాయ‌కుడ‌ని చెప్పారు. టిడిపి ప్రభుత్వం వ‌స్తే రాష్ట్ర అభివృద్ధితో పాటు అర్హులంద‌రికీ సంక్షేమ ప‌థ‌కాలు అందుతాయ‌న్నారు. క‌ర్నూల్లో త‌న‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే యువ‌త భ‌విష్యత్తుకు ఒక మార్గం చూపిస్తాన‌ని తెలిపారు. టి.జి భ‌ర‌త్ ను గెలిపించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని యువ‌త అన్నారు. ప్రజ‌ల్లో చైత‌న్యం తీసుకువ‌స్తామ‌ని తెలిపారు. పార్టీలో చేరిన వారిలో నితిన్‌, సాయినాథ్‌, అమ‌ర్‌, అఖిల్‌, త‌దిత‌రులు ఉన్నారు.

About Author