కురువ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ….
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగర సమీపం లోని A.P.Model School పక్కన ఉన్న శ్రీ భీరలింగేశ్వర స్వామి ఆలయం వద్ద ఈ రోజు ఉదయం .కర్నూలు జిల్లా కురవ సంఘం 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన కుల సంఘం నాయకులు గౌరవ అధ్యక్షులు కిష్టన్న అధ్యక్ష,ప్రధాన కార్యదర్శి పత్తికొండ శ్రీనివాసులు, ఎం .కే .రంగస్వామి జిల్లా మాజీ అధ్యక్షులు గడ్డం రామకృష్ణ అసోసియేట్ అధ్యక్షులు గుడిసె శివన్న, అమిలియో హాస్పిటల్ అధినేత ప్రముఖ వైద్యులు డా . ప్రసాద్ పంచలింగాల నాగరాజు,జిల్లా ఉపాధ్యక్షులు బి .వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో ఐదు లక్షలు జనాభా ఉన్న కురువ కులస్థులు ఆర్థికంగా, రాజకీయంగా,విద్యాపరంగా ఎదగాలని అన్నారు. తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని రాజకీయంగా కూడా ఎదగాలని అందరూ కలిసి కట్టుగా ఉండాలని కోరారు .రేపు ఆలూరులో జరిగే కురువ మహా గర్జన సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలో కురువలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రదాన పార్టీలు మాకు సీట్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సంఘముఅధ్యక్ష ,ప్రధానకార్యదర్శి శ్రీలీల,అనిత , కురువ సంఘం జిల్లా నాయకులు దేవేంద్ర, పాల సుంకన్న, ధనుంజయ, రామకృష్ణ, వేంకటేశ్వర్లు, తవుడు శ్రీనివాసులు తిరుపాల్ ,బాలరాజు ,రేమట సర్పంచ్ వెంకన్న ,సోమన్న ,అల్లబాబు ,బీచుపల్లి,నందకుమార్ ,మధు ,కృష్ణ శ్రీనివాసులు ,రంగస్వామి ,తదితరులు పాల్గొన్నారు .