PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సి ఆర్ ఆర్ మహిళా కళాశాలలో మై భారత్ పోర్టల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం..

1 min read

మహిళలు విద్యార్థి దశ నుంచే సృజనాత్మకత తో ఎదగాలి..

ఐసిడిఎస్ పిడి కెఎవిఎల్. పద్మావతి

ఆడపిల్లలు వ్యక్త వయసులో న్యూట్రిషన్ ఆహారత పదార్థాలు తీసుకోవాలి

బాలల సంరక్షణ అధికారి సిహెచ్ సూర్య చక్రవేణి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఏలూరు జిల్లా వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ వారి ఆదేశాల ప్రకారం శుక్రవారం వీరు బాల దివాస్ కార్యక్రమంలో భాగంగా మై భారత్ పోర్టల్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభ కార్యక్రమం స్థానిక సి ఆర్ ఆర్ మహిళా కళాశాల వట్లూరు లో నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా యూత్ ఆఫీసర్ అయినా డి. కిషోర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు అందరూ కూడా వారు నిర్ణయించుకున్న లక్ష్యాలు ఏ విధంగా చేరుకోవాలి అలాగే వాటికి సంబంధించిన గైడ్లైన్స్ ఏ విధంగా లెక్చరర్స్ తో తీసుకొని మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలి అని ఆశిస్తూ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.  అలాగే మై భారత్ పోర్టల్ పోర్టల్ సంబంధించి యూత్ అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మన భారతదేశాన్ని మనం గౌరవించుకోవడం ఎంతో ముఖ్యమన్నారు.  అలాగే మరో ముఖ్య అతిథి అయినటువంటి జిల్లా బాలల సంరక్షణ అధికారి అయిన డాక్టర్ .సిహెచ్ సూర్య చక్రవేణి మాట్లాడుతూ ఈ వీరు బాలా దివాస్ కి సంబంధించిన ప్రోగ్రామ్ యొక్క విశిష్టతను తెలియజేస్తూ అలాగే 22 , 23 డిసెంబర్ 2023 ఈ రెండు రోజుల్లో వీలు బాల దివాస్ కార్యక్రమంలో భాగంగా మై భారత్ పోర్టల్ రిజిస్ట్రేషన్స్ మరియు ప్లాంటేషన్ మరియు శ్రమదాన కార్యక్రమాలు నిర్వహించబడతాయని అలాగే 26 డిసెంబర్ 2023న వీర బాలా దివాస్ కార్యక్రమము యొక్క ముగింపు కార్యక్రమం జిల్లా స్థాయిలో నిర్వహించబడుతుందని తెలియజేశారు.  అలాగే ముఖ్యఅతి అయినటువంటి ఏలూరు అర్బన్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్  వి పద్మావతి మాట్లాడుతూ యుక్త వయసులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడపిల్ల ఏ విధమైన న్యూట్రిషన్ ఆహార పదార్థాలు తీసుకోవాలి అనే విషయాలు అదే విధముగా ప్రతి విషయంలోనూ ఉన్నతమైన ఆశయాలు కలిపి లక్ష్యాలను సాధించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపాల్ అయినటువంటి శైలజ మాట్లాడుతూ కాలేజీ తరఫున ఎన్ ఎన్ ఎస్ ఎస్ మరియు విద్యార్థులు మై భారత్ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేయిస్తామని అలాగే విద్యార్థులందరూ క్రమశిక్షణ తో విద్యను అభ్యసించడం వల్ల ఉన్నత లక్ష్యాలు చేరుకుంటారని తెలియజేసినారు. ఈ కార్యక్రమం నందు ఇన్స్టిట్యూషనల్ కేర్ ఆఫీసర్ సిహెచ్ శ్రీకాంత్  మరియు కౌన్సిలర్ యు బాలస్వామి మరియు ఓడబ్ల్యూ రాజకుమార్ కాలేజ్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ ఈశ్వరి మరియు ఉమెన్స్ కాలేజ్ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు 150 మంది పాల్గొనడం జరిగింది. అలాగే విద్యార్థుల తో మై భారత్ కు సంబంధించిన ప్రతిజ్ఞను చేయించడం జరిగింది. 22. 12. 2023 న సర్. సి ఆర్ ఆర్ అటానమస్ డిగ్రీ కాలేజ్ నందు మధ్యాహ్నం ఎన్. సి సి మరియు ఎన్ఎస్ఎస్, విద్యార్థిని విద్యార్థులతో మై భారత్ పోర్టల్ ఇనాగరేషన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రాజెక్ట్ డైరెక్టర్, డి ఆర్ డి ఏ, ఏలూరు జిల్లా అధికారి డాక్టర్ ఆర్. విజయ రాజు మరియు మరో ముఖ్య అతిథి అయినటువంటి జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారి కె ఏ వి ఎల్. పద్మావతి హాజరయ్యారు. మొదటగా ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపాల్ అయినటువంటి డాక్టర్ కే ఏ రామరాజు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలు తమ కాలేజీ నందు నిర్వహించడం చాలా సంతోషదాయకమని అదే విధంగా బాలలకు సంబంధించి చదువుతోపాటు సామాజిక కార్యక్రమాలు కూడా అవసరమని అది వారి భవిష్యత్తుకి ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేసినారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి వేణు గారు మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున  చేపట్టే ప్రతి కార్యక్రమం విద్యార్థిని విద్యార్థులు సామాజిక బాధ్యతను పెంపొందించడం కోసం నిర్వహించే కార్యక్రమాలని తెలిపినారు. అదేవిధంగా  సమాజం కొరకు దేశం కొరకు ఉపయోగపడే విధంగా మనలోని సృజనాత్మక శక్తి పెంపొందించుకునే విధముగా బాధ్యత కలిగి ఆచరించడం వల్ల మన సమాజం తోపాటు దేశ అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుందని తెలియజేసినారు. ముఖ్య అతిథి మహిళా సిస్ సంక్షేమ శాఖ అధికారి కే ఏ వి ఎల్ పద్మావతి మాట్లాడుతూ మై భారత్ పోర్టల్ యొక్క విశిష్టతను తెలియజేస్తూ అదే విధముగా ప్రతి ఒక్కరూ ఈ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేసుకోవడం ప్రతి ఒక్కరు బాధ్యతాన్ని అదేవిధంగా మీతో పాటు మీ ఫ్రెండ్స్ తో కూడా ఈ పోర్టల్ నందు రిజిస్ట్రేషన్ చేయించడం వలన మన భారతదేశం యొక్క కీర్తిని పెంచిన వాళ్ళము అవుతామని తెలియజేశారు. అదే విధముగా విద్యార్థి దశలోనే విలువలతో కూడిన విద్యను అభ్యసించడం వల్ల మనలోని శక్తి సామర్థ్యాలు పెంచుకోవచ్చని తెలియజేసినారు. అదేవిధంగా విద్యార్థినీ విద్యార్థులతో మై భారత్ పోర్టల్ కి సంబంధించిన ప్రతిజ్ఞను చేయించడం జరిగింది. అలాగే ముఖ్య అతిథి డి ఆర్ డి ఏ పిడి డాక్టర్ విజయరాజు మాట్లాడుతూ    సమాజ శ్రేయస్సుకు ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలు అందించడం వల్ల విద్యార్థి దశలోని సామాజిక స్పృహను కలిగి ఉన్నత స్థితిలో చెందడానికి అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్. సి సి ఆఫీసర్  డాక్టర్ ఎం నవీన్ కుమార్ , ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ డాక్టర్ బి ఇమాన్యుల్ మరియు ఇన్స్టిట్యూషనల్ కేర్ ఆఫీసర్ శ్రీకాంత్ మరియు కౌన్సిలర్  యు బాలస్వామి మరియు ఓడబ్ల్యు  రాజకుమార్ కాలేజీ విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

About Author