వెంకన్న చెరువు స్మశానవాటిక చెత్తాచెదారంతో అస్తవ్యస్తం..
1 min readదుర్వాసన, విష సర్పాలతో భయభ్రాంతులకు గురవుతున్న స్థానిక ప్రజలు..
కన్నెతి చూడని కాన్స్టెన్సీ ఎమ్మెల్యే , కార్పొరేషన్ అధికారులు..
జనసేన పార్టీ జిల్లాఅధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు నగరంలోని పలు స్మశాన వాటికలకు అంతిమ సంస్కారాల కోసం భౌతిక కాయాలను తీసుకువెళ్తే వారి ఆత్మ క్షోభిస్తుందని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు నగరంలోని తూర్పు వీధి, మారుతి నగర్, దక్షిణ వీధి వెంకన్న చెరువు వద్ద స్మశాన వాటికలను జన సైనికులతో కలిసి రెడ్డి అప్పలనాయుడు పరిశీలించారు. అధ్వానమైన పారిశుధ్యం, అడవులను తలపించే విధంగా ఉన్న స్మశాన వాటికను చూసి దిగ్భ్రాంతి చెందారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ మరణించిన వ్యక్తి భౌతికకాయాన్ని స్మశాన వాటికకు తీసుకువెళ్తే ఇంత అద్వానంగా ఉన్న ప్రాంతంలో అంతిమ సంస్కారాలు చేస్తారా అని ఆ వ్యక్తి ఆత్మ క్షోభిస్తుందన్నారు. స్మశాన వాటికలను చూసిన ప్రజలు కార్పొరేషన్ అధికారులను, ఎమ్మెల్యేను, మేయర్ ను అసహ్యయించుకుంటున్నారన్నారు. కాలువలు పూడిపోయాయని, దుర్వాసన వెదజల్లుతోందని, దోమలకు నిలయంగా మారడంతో స్మశానవాటికులకు వచ్చే ప్రజలు రోగాల బారిన పడి, ఆసుపత్రుల పాలై ఇల్లు గుల్ల చేసుకుంటున్నారని తెలిపారు. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా ఎవరు మరణించినా చివరకు స్మశాన వాటికలకు ఆరు అడుగుల నేల కోసం రావాల్సిందేనని, ప్రశాంతంగా శాశ్వత నిద్రలోకి వెళ్లాల్సిందేనన్నారు. స్మశాన వాటికలను అధ్వానంగా తయారు చేసిన ఎమ్మెల్యే ఆళ్ల నానికి మళ్లీ ఎందుకు ఓటు వెయ్యాలి అని ప్రజల ప్రశ్నిస్తున్నారన్నారు. 25 సంవత్సరాలు రాజకీయ అనుభవం కలిగిన ఆళ్ళ నాని మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎమ్మెల్సీగా, ఉప ముఖ్యమంత్రిగా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించి, సొంత నియోజకవర్గంలో స్మశాన వాటికలను బాగు చేయలేని ఆళ్ళ నాని మాకొద్దు బాబోయ్ అని ప్రజలు అంటున్నారన్నారు. వెంకన్న చెరువు ప్రాంతంలో చెత్తాచెదారంతో దుర్వాసనతో మార్గం లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్న, కాన్స్టెన్సీ ఎమ్మెల్యే కానీ కార్పొరేషన్ అధికారులు కానీ కన్నెత్తి చూడకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసిపిని తిరస్కరిస్తున్న ప్రజలు ఏలూరులో ఆళ్ల నాని పట్ల తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారన్నారు. ఏలూరు కార్పొరేషన్కు వందల కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నప్పటికీ ప్రజల శ్రేయస్సు కోసం, చివరకు మరణించిన తర్వాత దహన సంస్కారాలు చేసుకునేందుకు స్మశాన వాటికలను అనుకూలంగా లేని విధంగా ఏలూరు పాలకులు తయారు చేశారని, మేయర్, ఎమ్మెల్యేలు గాడిదలు కాస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆళ్ల నాని వంటి వారు సొంతంగా స్థలాలు కొనుక్కొని సమాధులు నిర్మించుకుంటారని, మరి ప్రజల పరిస్థితి ఏమిటని, అడవులను తలపించే విధంగా ఉన్న స్మశాన వాటికల్లో అంతిమ సంస్కారాలు ఎలా చేస్తారన్నారు. ఏలూరు కార్పొరేషన్ పరిధిలోని స్మశాన వాటికలకు ఎకరాల కొలది స్థలాలు ఉన్నాయని, వాటిని పరిశుభ్రం చేసి నీటి సౌకర్యం కల్పించి భౌతిక కాయం వెంట వచ్చేవారికి కనీస వసతులు లేవన్నారు. ప్రజల పన్నల ద్వారా వస్తున్న ఆదాయం, ప్రభుత్వం నిధుల ద్వారా స్మశాన వాటికను అభివృద్ధి చేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా ఎమ్మెల్యే, మేయర్, కార్పొరేటర్లు వ్యవహరిస్తున్నారు. ఎవరు కూడా ఏలూరు ప్రజాప్రతినిధుల ఆస్తులు అడగడం లేదని, స్మశాన వాటికలను అభివృద్ధి చేయాలని అంటున్నారని, ఎందుకు మనసు అంగీకరించడం లేదని నిలదీశారు. వారికి ఉన్న పదవులు గాడిదలు కాయడానికా అని ప్రశ్నించారు. రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, వైజాగ్ తదితర ప్రాంతాల్లో స్మశాన వాటికలు ఆహ్లాదకరంగా, ఉద్యానవనంలా ఉంటాయన్నారు. ఏలూరు నియోజకవర్గ పరిధిలో మరణించిన వారి భౌతిక కాయాలకు ప్రశాంతంగా దహన సంస్కారాలు చేసే అవకాశం లేకుండా స్మశానవాటికలను తయారుచేయడం దుర్మార్గమన్నారు. విలువలు లేని, పనిచేయలేని దద్దమ్మలు పదవుల్లో ఉన్నారని, మళ్లీ మోసం చేసి ఓట్లు అడిగేందుకు మారువేషాలు వేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండి వారిని నిలదీయాలని రెడ్డి అప్పలనాయుడు పిలుపునిచ్చారు. ప్రజలు కట్టిన పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని బొక్కుతూ, వేల కోట్లు కూడబెట్టుకుని అంతస్థుల మీద అంతస్తులు నిర్మించుకుంటూ కులుకుతున్నారన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోని ఎమ్మెల్యే నాని చివరకు స్మశాన వాటికలో మరణించే వారి ఆత్మకు శాంతి లేకుండా చేస్తున్నారన్నారు. ఇటువంటి వారికి తగిన గుణపాఠం చెప్పి నియోజవర్గం నుంచి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు.