ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టండి.
1 min readఇంచార్జ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లాలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఇంచార్జ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం స్థానిక ఔట్ డోర్ స్టేడియం లోఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో బాగంగా నిర్వహించిన యోగ కార్యక్రమంలో ఇంచార్జ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య పాల్గొన్నారు.ఇంచార్జ్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ జిల్లాలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. ఈనెల 26వ తారీకు నుండి ప్రారంభం కానున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పై ప్రజలకు అవగాహన కల్పించడం కొరకు ఈ నెల 22 వ తేది నుండి 24 వ తేది వరకు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా 22 వ తేది టెన్నికాయిట్, ఈరోజు యోగ కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. 24 వ తేది 3K మారథాన్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు గాను తగిన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ రోజు జరిగిన యోగా కార్యక్రమంలో జాతీయస్థాయిలో పేరుపొందిన యోగా సాధకులు, పిఈటీలు అధిక సంఖ్యలో పాల్గొన్నారన్నారు. అదే విధంగా విద్యార్థులు యోగా ఆసనాలను ప్రదర్శించి ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమాలు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుందని ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయంవంతం చేయాలని ఇంఛార్జి కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీఈఓ రంగారెడ్డి, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ ఎస్ శ్రీనివాసరావు, రాష్ట్ర యోగ సంఘం ప్రధాన కార్యదర్శి యోగచార్య అవినాష్ శెట్టి, యోగా సాధకులు, ఇతరులు పాల్గొన్నారు.