భారీగా ఆలూరుకు తరలిన కురువలు
1 min readమదాసి మదారి కురువ మహా సింహ గర్జనకు భారీగా తరలిన కురువలు
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: ఆదివారం ఆలూరులో జరిగే కురువ మహా సింహ గర్జనకు పత్తికొండ నియోజకవర్గం నుండి కురువలు భారీగా తరలి వెళ్లారు. దాదాపు వంద వాహనాల్లో కురువ సంఘాల ఆధ్వర్యంలో మాదాసి మదారి కురువలు భారీగా ఆలూరుకు బయలుదేరి వెళ్ళారు . మాదాసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సోమలింగుడు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బత్తిన వెంకటరాముడు, కురువ సంఘం నాయకులు లోకనాథ్, పుండుకూర బ్రహ్మయ్య ఆధ్వర్యంలో పత్తికొండ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల నుండి కురువలను పెద్ద ఎత్తున వాహనాల్లో తరలించారు.రాబోయే ఎన్నికలలో కర్నూల్ పార్లమెంటు స్థానం మరియు రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని రాష్ట్ర అధ్యక్షుడు సోమలింగుడు ఈ సందర్భంగా తెలిపారు. అలాగే మాదాసి కురువ ఎస్సి సర్టిఫికెట్లను జారీ చేయడంలో వైసిపి తెలుగుదేశం ప్రభుత్వాలు తమ కులాన్ని నిర్లక్ష్యం చేశాయని అన్నారు. రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం వైసిపి పార్టీలు తమ సామాజిక వర్గాన్ని గుర్తించి కురువ జనాభా ప్రాతిపదికన కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో రెండు ఎమ్మెల్యే స్థానాలు, ఒక ఎంపీ స్థానము కేటాయిస్తేనే ఆ పార్టీలకే మాదాసి,మధారి కురువల మద్దతు ఉంటుందని చెప్పారు. కర్నూలు జిల్లాలో మదాసి మదారి కురువల జనాభా 6 లక్షలకు పైగా ఉండగా కానీ ప్రభుత్వ అధికారుల లెక్కల ప్రకారం కేవలం లక్ష జనాభా మాత్రమే కురువలు ఉన్నట్లు చూపడం హాస్యాస్పదమన్నారు.ఈ కార్యక్ర మంలో పకీరప్ప,గోరవ లాలప్ప, పుచ్చకాయల మాడ రాముడు, పందికోన శీను, రాతన ప్రకాష్, మైలార్, బొంబాయి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.