హిందువుల రుద్రభూమి అన్యమతస్తుల దురాక్రమన
1 min readస్పందించిన కోడుమూరు నియోజకవర్గ కన్వీనర్ మీసాల ప్రేమ్ కుమార్ అక్రమ అరెస్టు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: హిందువుల రుద్ర భూమిని ఆక్రమణ చేసి అన్య మత కట్టడం కట్టడాన్ని నిరసిస్తూ, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ ఆదివారము ఆదివారo ఉదయము 11 గంటలకు విశ్వ హిందూ పరిషత్ – బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ” ఛలో గోనెగండ్ల ” కార్యక్రమానికి మద్దతు తెలుపుతూ కోడుమూరు నియోజకవర్గ బిజెపి కార్యకర్తలు నాయకులు పెద్దసంఖ్యలో తరలివెళ్ళుటకు సన్నద్దమవుతుండగా తెల్లవారుఝామున 5:00 గంటలకు కార్యక్రమాన్ని భగ్నo చేసే కుట్రలో భాగంగా రాష్టప్రభుత్వo అక్రమ అరెస్టులు , అనచివేత ధోరణులు అవలంబించింది … ఇందులోభాగంగా జిల్లా అద్యక్షుడు కునిగిరి నీలకంఠ గారి ఆదేశాలమేరకు , కోడుమూరు నియోజకవర్గ కన్వీనర్ మీసాల ప్రేమ్ కుమార్ కార్యక్రమానికి వెళ్ళేలోపు ఉదయo 5:00 గృహనిర్బంద అరెస్టు చేసిందన్నారు. కోడుమూరు నియోజకవర్గo కర్నూల్ రూరల్ మండలo నుండి వెళ్తున్న … నియోజకవర్గం మాజీ కన్వీనర్ సద్దల మధు కిషోర్, జిల్లా కార్యవర్గ సబ్యులు సుధాకర్ రెడ్డి ,రామచంద్ర నాయుడు ,మధు ,మనోహర్ శివ మహేష్ లను దారి మధ్యలో అడ్డుకొని తాలుకా పోలీస్ స్టేషన్ కు తరలించిన YSRCP ప్రభుత్వ పోలీస్ సిబ్బంది. అదేవిధంగా, గూడూరు రూరల్ మండల అద్యక్షుడు బట్టు రాజశేఖర్ , రాజు లను నాగలాపురంలో .,, కోడుమూరు మండల అద్యక్షుడు శన్ముఖ ఆచారి కోడుమూరులో అక్రమ అరెస్టు చేయడo సి బెలగల్ మండల అద్యక్షుడు దేవన్నను స్టేషన్ లో నిర్బందించడo ప్రభుత్వ నిరంకుశత్వ పాలనకు నిదర్శనo అన్నారు. ఇంకా భజరగ్ ధళ్ ముఖ్య నాయకులు తూముకుంట ప్రతాప్ రెడ్డిని హిందుత్వ వాదులు రాష్ట్ర సర్పంచుల సంఘo అద్యక్షుడు బిర్రు ప్రతాప్ రెడ్డి ఇతర ముఖ్యనాయకులను జిల్లావ్యాప్తంగా అక్రమ అరెస్టులు చేయడo జరిగింది.