యేసుప్రభు ఆశీస్సులు..అందరిపై ఉండాలి
1 min readటీడీపీ ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరి నేషపోగు కిరణ్మయి
- పాస్టర్లకు, మతపెద్దలకు బట్టలు పంపిణీ
కోడుమూరు, పల్లెవెలుగు:ఏసుప్రభు మార్గం సన్మార్గమని… ఆయన ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు టీడీపీ ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరి నేషపోగు కిరణ్మయి. క్రిస్మస్ పండగ సందర్భంగా ఆదివారం కోడుమూరు నియోజకవర్గం పరిధిలోని ఈ.తాండ్రపాడులోని ఏబీఎన్ చర్చిలో ఆమె ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పాస్టర్లు, మత పెద్దలకు, వృద్ధులకు బట్టలు పంపిణీ చేశారు. ఆ తరువాత క్రైస్తవుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కిరణ్మయి మాట్లాడుతూ ఏసుక్రీస్తు మార్గం…సన్మార్గం అని పేర్కొన్నారు. క్రిస్మస్ పండగను క్రైస్తవ సోదరసోదరీమణులు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పాస్టర్లు, మత పెద్దలు ఆకాంక్షించారు టీడీపీ ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరి నేషపోగు కిరణ్మయిని శాలువాతో ఘనంగా సన్మానించారు.