ఘనంగా అటల్ బిహారీ వాజ్పేయి 99వ జన్మదిన వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఈరోజు హోలగుంద మండలంలోని హెబ్బటం గ్రామంలో భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి 99వ జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమము హోలగుంద మందల అధ్యక్షుడు ఏ.ఈ ఎన్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆలూరు అసెంబ్లీ కన్వీనర్ D.M వెంకటరాముడు కో కన్వీనర్ తెలుగు అంబన్న కిషన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గజ్జహల్లి చాకలి రామలింగం పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో జన్మించడం జరిగిందని. భారతీయ జనతా పార్టీ తరఫున ప్రధాన మంత్రి పదవిని పొందిన నాయకుడు ఈయన బ్రహ్మచారి ఇతను మొదటిసారిగా రెండవ లోకసభకు ఎన్నికయ్యారు మధ్యలో మూడవ 9వ l లోకసభ తప్పించి 14 లోకసభ వరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు. 1960 నుండి 1973 వరకు జనసంఘ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసే 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. 1996లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి యోగం లభించినా అది 13 రోజులకే పరిమితం అయింది. అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994 లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది మొదటి కాంగ్రెస్ ఎతర ప్రభుత్వమైన మురార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వివరాల శాఖను నిర్వహించారు. అనారోగ్య కారణాల వల్ల క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకున్నారు ఆయన దేశాన్ని చేసిన విశేష సేవకు గాను భారత ప్రభుత్వం మార్చి 12 2015లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది ఈయన పుట్టినరోజు డిసెంబర్ 25న సుపరిపాలన దినంగా భారత ప్రభుత్వం ప్రకటించింది ఈ కార్యక్రమంలో ఆలూరు మండల అధ్యక్షుడు తలారి గాదిలింగ హోల గుంద వైస్ ప్రెసిడెంట్ జాంటి వీరేష్ ప్రధాన కార్యదర్శి మహేష్, ఉల్లిగన్న, వైస్ ప్రెసిడెంట్ కా లప్ప రమేష్ ఆంజనేయ, చిన్న ,ఆ దెబ్బ బెనకప్ప రామాంజనేయులు తదితర బిజెపి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.