PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అభివృద్ధికి నోచుకోని 10వ వార్డు…

1 min read

హోళగుంద మండల కేంద్రలో 10వ వార్డు కాలనీలో విద్యుత్ స్తంభాలకు వైరు వీధిలైట్లు మరియు సీసీ రోడ్లు డ్రైనేజీలకు ఎటువంటి అభివృద్ధి పనులు చేయని మండల అధికారులు.

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఈ సందర్భంగా పెద్దహ్యాట శ్రీరంగ దిడ్డి తిక్కస్వామి మల్లికార్జున నాగరాజు సతీష్ రారాయి సిద్దు మాట్లాడుతూ  హోళగుంద మండల కేంద్రలో 10వ వార్డు కాలనీలో విద్యుత్ స్తంభాలకు వైరు వీధిలైట్లు మరియు సీసీ రోడ్లు డ్రైనేజీలకు ఎటువంటి అభివృద్ధి పనులు చేయని మండల అధికారులు అని వారు అన్నారు. ప్రతినెల కరెంట్ బిల్లు ఇంటి పన్ను కులాయి పన్నులు మాత్రం వసూలు చేస్తున్నప్పటికీ తమకు సదుపాయాలు కల్పించడంలో మండల అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని వారు ఎద్దేవా చేశారు. గతంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఇక్కడ గుడిసెలు కూడా తగ్గుదం జరిగిన సంఘటనలు జరిగాయి అధికారులు తమకు ఏమాత్రం సంబంధం లేకుండా వ్యవహరించడం సిగ్గుచేటు. మరికొన్ని చోట్ల స్తంభాలు లేక కర్రలు పాతుకొని తమ ఇంటికి విద్యుత్తు వైర్లను లాక్కున్నారు. మరికొన్నిచోట గుడిసెలు పైన విద్యుత్ తీగలు ప్రమాదకరంగా వేలాడుతున్న కూడా మండల అధికారులు ఉన్నారా లేరా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాత్రి వేళలో ఏ సమయంలో ఏ ఆపద ముంచుకొస్తుందో అని అక్కడ నివసిస్తున్న కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు తమ సమస్యలు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా అధికారులు ప్రజాప్రతినిధులు  పట్టించుకోవడంలేదని కాలనీవాసులు వాపోయారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. లేనియెడల కాలనీ వాసులతో పెద్ద ఎత్తున ప్రజలతో మండల అధికారుల కార్యాలయాలు ముట్టడిస్తామని వారు అధికారులకు హెచ్చరించారు. అదేవిధంగా సమస్యలు పరిష్కారం కానీ ఎడల జిల్లా కలెక్టర్  దృష్టికి కూడా తీసుకెళ్తామని వారు తెలియజేశారు.

About Author