సమన్వయంతో పనిచేస్తే అద్భుత ఫలితాలు
1 min read– కార్పొరేటర్లు.. సచివాలయ ఉద్యోగులకు సూచించిన మేయర్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: ప్రజల వద్దకే పాలన అందించాలనే మంచి ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారని, తద్వారా స్థానిక సమస్యలు వెంటనే పరిష్కారం అవుతుందని కర్నూలు నగర మేయర్ బీవై రామయ్య సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో కమిషనర్ డి.కే బాలాజీ గారి అధ్యక్షతన ‘వార్డు సభ్యులకు– వార్డు కార్యదర్శులకు ’ అవగాహన సదస్సు నిర్వహించారు.
మేయర్ బీవై రామయ్య మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, సచివాలయ ఉద్యోగులు సమన్వయంతో పని చేస్తే త్వరగా ఫలితాలు వస్తాయన్నారు. కర్నూలు న్యాయరాజధానిగా ఏర్పడుతోందని, అందుకు తగ్గ పరిస్థితులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. దివంగత నేత వైఎస్సార్ జయంతి సందర్భంగా కర్నూలు నగరంలో 50వేల మొక్కలు నాటుదామని పిలుపునిచ్చారు.