సమస్యల పరిష్కారానికే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
1 min readమంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: గ్రామాల్లో ప్రజల సమస్యలను పరిష్కారానికే ప్రభుత్వగడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అన్నారు. బుధవారం నియోజవర్గ కేంద్రమైన మంత్రాలయం లో రామచంద్ర నగర్ లో సచివాలయం 2 పరిధిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి ఆయన సతీమణి కాచాపురం సర్పంచ్ వై.జయమ్మ ,కూతురు ప్రియాంక వేర్వేరుగా గడపగడపకు వెళ్లి సంక్షేమ పథకాలు అమలు తీరును గురించి లబ్దిదారులతో అడిగి తెలుసుకున్నారు. ఇళ్ల స్థలాలు రాలేదని వై. జయమ్మ దృష్టికి తీసుకుని వెళ్లడంతో భూమి కొనుగోలు చేసి పంచేందుకు చూస్తున్నామని తప్పకుండా ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు ఎవైనా సమస్యలు ఉంటే నేరుగా మా దగ్గరకు వచ్చి చెప్పుకొవచ్చునని వివరించారు. గడపగడపకు తిరుగుతున్న సమయంలో వై. జయమ్మ, ప్రియాంక అప్యాయంగా పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఓ హోటల్ వద్ద ‘దోసే’స్తు అందరినీ ఆకట్టుకున్నారు. కాలనీలో పలు చోట్ల సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో ఇబ్బందికరంగా ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లడంతో త్వరలోనే చేయిస్తామని తెలిపారు. వచ్చే నెల నుంచి 3 వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని వృద్ధులకు వివరించారు. ఓ ఇంటి వద్ద పెన్షన్ ఎవ్వరూ ఇస్తున్నారు అవ్వ ను ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అడగగా నా మనవడు జగన్ అని సంతోషం వ్యక్తం చేసింది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నేతలు జి. భీమారెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, పెట్రోలు బంక్ శీనన్న, సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ వేణు గోపాల్ రాజ్, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య, ఎంపీడీవో మణిమంజరి, ఈవోపీఆర్డి ప్రభావతి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ వేద స్వరూప, ట్రాన్స్ కో ఏఈ గోవిందు, ఐసీడీఎస్ సూపర్ వైజర్ నాగలక్ష్మి, ఏవో జీరా గణేష్, విద్యాధికారి మోహనుద్దీన్, మండల స్థాయి అధికారులు, ఈవో నాగరాజు, వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున, వైస్ ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర, సచివాలయ కో కన్వీనర్ రాఘవేంద్ర ఆచారి, ఉప సర్పంచ్ హోటల్ పరమేష్, ఎంపిటిసి సభ్యులు వెంకటేష్ శెట్టి, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.