సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలి – ఆప్టా
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: రాష్ట్ర విద్యా శాఖ లో సమగ్ర శిక్ష లో పని చేసే ఉద్యోగుల సేవలు ప్రస్తుతం చాలా కీలకంగా వున్నాయి. అట్టి వారు ఈ నెల 19 వ తేదీ నుండి సమ్మె లో ఉన్నారు.దాని వలన విద్యా శాఖ లో ముఖ్యంగా మండల విద్యాధికారి నిర్వహణ లో వుండే ప్రాథమిక విద్య లో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టీ సమగ్ర శిక్ష లో పని చేయుచున్న ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ లను మానవత్వం తో వెంటనే పరిష్కారం చూపాలని ఆప్టా రాష్ర్ట అధ్యక్షుడు ఏ జి ఏస్ గణపతి రావు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ప్రకాష్ రావు లేఖ ద్వార ముఖ్య మంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, విద్యా శాఖ మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ కి మరియు రాష్ర్ట విద్యా శాఖ అధికారులకు వేర్వేరుగా లేఖల ద్వారా ప్రాతినిద్యం ఇవ్వడం జరిగింది. రాష్ట్రం లో సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ ల కొరకు వారు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ ఆంద్ర ప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆ ప్టా) సంపూర్ణ మద్దతు తెలియచేయటము జరగింది.