PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

“లెప్రసీ కేసు డిటెక్షన్ క్యాంపెయిన్…

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు మెరీడియన్ ఫంక్షన్ హాల్ పట్టణ ఆరోగ్య కేంద్రం నందు “లెప్రసీ కేసు డిటెక్షన్ క్యాంపెయిన్(LCDC)” కుష్టు రోగులను గుర్తించే కార్యక్రమం జిల్లా లెప్రసీ అయిడ్స్ అధికారి డాక్టర్ భాస్కర్ ప్రారంభించారు. జిల్లాలో 27.12.2023 నుండి 12. 1.2024 వరకు ఇంటింటికి ఆశ మరియు పురుష వాలంటీర్లు తిరిగి ప్రతి కుటుంబ సభ్యుని పరీక్ష చేస్తారు స్పర్శ లేని మచ్చలు, నరాలు వాపు, చేతుల నుండి వస్తువులు జారి పోవడం ,కాళ్ల నుండి చెప్పులు జారిపోవడం ,కాళ్లకు పుండ్లు మొదలగునవి అనుమానిత కుష్టి వ్యాధి లక్షణాలు ఉంటే ప్రా.ఆ.కాం.డాక్టరు తో చూపించి వ్యాధి నిర్ధారించి, ఎం. డి. టి బహుళ ఔషధ చికిత్స ఉచితంగా అందిస్తారు 6 నెలలు/12 నెలల చికిత్స.ఈ కార్యక్రమంలో డాక్టర్ మల్లికార్జున రెడ్డి గారు మాట్లాడుతూ ప్రాథమిక దశలో వ్యాధిని గుర్తిస్తే అంగవైకల్యం నివారించవచ్చు అని అన్నారు. యచ్ .ఈ.ఓ. శివశంకరరావు మాట్లాడుతూ సమాజంలో కుష్టి రోగుల పట్ల వివక్ష ,చిన్నచూపు చూడరాదన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ భాస్కర్(DLO)  ,డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి(DNMO )గారు, శివ శంకర్ రావు(HEO ), యు.హెచ్.సి. వైద్యాధికారి మాధవి , వార్డ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి,డి పి ఎం ఓ – రాజు, హక్, పి.టి.రెడ్డి బాబు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

About Author