ఓటర్ల తుది జాబితా జనవరి 22న ప్రచురిస్తాం…
1 min readజిల్లా రెవెన్యూ అధికారి కె.మధుసూదన్ రావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఓటర్ల తుది జాబితా జనవరి 22న ప్రచురించడం జరుగుతుందని జిల్లా రెవెన్యూ అధికారి కె.మధుసూదన్ రావు తెలిపారు.బుధవారం స్పెషల్ సమ్మరీ రెవిజన్ 2024 లో భాగంగా వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా రెవెన్యూ అధికారి కే మధుసూదన్ రావు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ క్లెయిమ్స్ మరియు డిస్పోజల్స్ డిసెంబర్ 26వ తారీకు పూర్తిచేసి ఓటర్ల తుది జాబితా 2024 వ సంవత్సరం జనవరి 5వ తారీఖున చేయవలసి ఉండేది కానీ ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు క్లెయిమ్స్ మరియు డిస్పోజల్స్ 2024 వ సంవత్సరం జనవరి 12వ తారీకు పూర్తిచేసి 2024 వ సంవత్సరం జనవరి 22వ తారీకు నాటికి ఓటర్ల తుది జాబితాను ప్రచురించడం జరుగుతుందన్నారు. ఇంటింటి సర్వే మరియు స్పెషల్ సమ్మరీ రివిజన్ – 2024 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి ఎటువంటి లోపాలకు ఆస్కారం లేకుండా 2024 సంవత్సరమున జనవరి 22 వ తేది పటిష్టమైన తుది ఓటర్ల జాబితాను రూపొందించేందుకు తగిన చర్యలు చేపడుతున్నామని అందుకు గాను అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని డిఆర్ఓ తెలిపారు.కొంతమంది రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ ఇంటింటి సర్వేలో ఆదోని,ఎమ్మిగనూరు ప్రాంతాలలో కొంతమంది సిబ్బంది ఇంటి వద్దకు వెళ్లకుండా ఫోన్ ద్వారానే సమాచారం తెలుసుకుంటున్నారని డిఆర్ఓకు తెలిపారు, అలాంటి సమస్య ఉంటే వ్రాతపూర్వకంగా తెలియజేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఆర్ఓ తెలియజేశారు. కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగులు కూడా బదిలీపై వెళ్ళారని, కొంతమంది కూలీలు పనుల కోసం వలస వెళ్లారని అలాంటి వాటిని గుర్తించాలని పార్టీల ప్రతినిధులు డిఆర్ఓకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ మురళి, బిజెపి, టిడిపి, పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.