పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు మరువలేనివి..
1 min readఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు మున్సిపాలిటీ లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలను ఎప్పటికీ మరువలేనీవని మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పనిచేస్తున్న పర్మినెంట్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ కార్మికులు మరియు క్లాస్ 4 ఉద్యోగులకు మేయర్ చాంబర్లో గురువారం నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, కో-ఆప్షన్ సభ్యులు చేతుల మీదుగా యూనిఫాo అందజేయడం జరిగింది.పబ్లిక్ హెల్త్,క్లాస్ 4 ఉద్యోగులు 286 మంది ఉన్నారన్నారు.ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మహిళా కార్మికులకు మూడు చీరలు 3 జాకెట్లు,మగవారికి 2 జతలకు సరిపడా క్లాత్, అలాగే అందరికీ రెండు జతల చెప్పులు,3 టవల్స్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. కరోనా వంటి సమయంలో కూడా ప్రాణాలకు సైతం పణంగా పెట్టి ఎంతో సేవలందించారన్నారు. వీరు చేస్తున్న సేవలను ఎప్పటికీ మరువమని మేయర్ నూర్జహాన్ పెదబాబు అన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు, నూక పేయి సుధీర్ బాబు, కార్పొరేటర్లు జజ్జవరపు విజయనిర్మల, సబ్బన శ్రీనివాసరావు, కల్వకొల్లు సాంబ, బత్తిన విజయ్ కుమార్, కో-ఆప్షన్స్ సభ్యులు నీత విజయ్ కుమార్ జైన్, ఎంహెచ్ఓ డాక్టర్ మాలతి, సెక్రటరీ ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.