చెట్లకు పింఛన్లు ఇచ్చిన ప్రభుత్వం !
1 min readపల్లెవెలుగు వెబ్: చెట్లు మనుషులకు ఎంతో సేవ చేస్తాయి. స్వచ్చమైన ప్రాణవాయివు అందిస్తాయి. ఫలాలు, జౌషధ ప్రయోజనాలు చెట్ల నుంచి మానవాళి ఎన్నో తరాలుగా పొందుతోంది. అలసటపడి వచ్చిన బాటసారికి చెట్లు ఏసీకి మించిన చల్లదనాన్ని, ఆశ్రయాన్ని ఇస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే చెట్లు లేకుండా మనిషి బతకలేడు అని చెప్పొచ్చు. అలాంటి చెట్లకు పింఛను ఎందుకు ఇవ్వకూడదని హరియాణ ప్రభుత్వం ఆలోచించింది. ఆలోచన తట్టిందే తడువుగా రాష్ట్రంలో 75 ఏళ్లు పైబడిన వృక్షాలకు నెలకు 2500 ఫించను ఇవ్వాలని నిర్ణయించింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 2500 చెట్లు ఉన్నాయి. వాటి సేవకు గౌరవ భృతిగా ఫించను మంజూరు చేసినట్టు హర్యాణ ప్రభుత్వం చెబుతోంది. వంద ఎకరాలు సేకరించి వివిధ చెట్లను నాటి ఆక్సిజన్ వనాలు పెంపొందించేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది.