PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చి: కె.నోయల్ విల్ ఫ్రైడ్ కి వయోలిన్ లో ప్రధమ బహుమతి..

1 min read

ప్రాథమిక దశనుండే ప్రతిభను మెరుగుపరచుకోవాలి..

జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్, ఎస్పీ మేరీ ప్రశాంతి

అభినందించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : హేలాపురి బాలోత్సవంలో సి.ఆర్.ఆర్.పబ్లిక్ స్కూల్ లో ఆరవ తరగతి చదువుతున్న నోయల్ విల్ ఫ్రైడ్ కి జూనియర్స్ విభాగంలో వయోలిన్ లో ప్రధమ బహుమతి లభించింది.ఈ బహుమతి ని ఏలూరు జిల్లా కలెక్టర్  ప్రసన్న వెంకటేష్  మరియు  జిల్లాఎస్.పి  మేరి ప్రశాంతి చేతులు మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు మాట్లాడుతూ ప్రాథమిక విద్యాభ్యాసం నుండే తమలోని ప్రతిభను (స్కిల్స్) మెరుగుపరుచుకోవాలని అన్నారు. నోయెల్ తండ్రి  కప్పల సత్యనారాయణ జిల్లా ఖజానా కార్యాలయం లో సీనియర్ అకౌంటెంట్ గా మరియు తల్లి రాణి శనివారపు పేట ఎమ్.పి.పి స్కూల్ లో సెకండ్ గ్రేడ్ టీచర్ గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి నోయెల్ ను సి.ఆర్.ఆర్ స్కూల్ ప్రిన్సిపాల్ మరియు ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని అభినందించారు.

About Author