ఎస్ఎఫ్ఐ. 24వ రాష్ట్ర మహాసభ…
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల : నంద్యాల జిల్లా విద్యార్థుల సమస్య లపై నంద్యాల జిల్లా సహాయక కార్యదర్శి బత్తిని ప్రతాప్ మాట్లాడుతూ , డోన్ మండలం లో సాంఘిక సంక్షేమ హాస్టల్లు అద్దె భవనాలలో విద్యార్థులు ఉంటున్నారని.అలాగే పాణ్యం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కి, నాడు _నేడు పనులు తొందరగా పూర్తి చేయాలన్నారు.నాడు _నేడు పనులలో అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్ కు కాంపౌండ్ వాల్ మధ్యలో ఆగిపోయినందువలన స్కూల్ పరిధిలోని అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని గత 30 సంవత్సరాలుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కోసం విద్యార్థులతో పోరాటాలు చేయగా లాస్ట్ ఇయర్ డిగ్రీ కాలేజ్ వచ్చినది. అయితే డిగ్రీ కాలేజి జిల్లా పరిషత్ హై స్కూల్ ఆవరణంలోనే రెండు రూములు తీసుకొని క్లాసులు నిర్వహిస్తూ కాలం గడుపుతూ ఉన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం 5 ఎకరాలు ఏర్పాటు చేసి కాలేజీ నిర్మాణం వెంటనే చేపట్టాలని కోరుతూ ఉన్నాం అలాగే ఏపీ మోడల్ స్కూలుకు, కేజీబీవీ స్కూల్, హాస్టల్ కు ప్రత్యేకమైన సీసీ రోడ్డు వెనక భాగంలో వేయాలని కోరుతూ,. ఈ స్కూల్ లకు వెళ్లాలంటే సుగాలి మెట్ట దగ్గర ఉన్నటువంటి నేషనల్ హైవే రోడ్డు దాటి వెళ్లాలి విద్యార్థులు ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నది. అందుకని ఈ యొక్క స్కూల్ కు అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టలని కోరారు. అలాగే ఒక గర్ల్స్ సంక్షేమ హాస్టల్, ఐటిఐ కళాశాల కూడా ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా బృందం అశోక్, తేజ, మధు, ఇమ్రాన్ పాల్గొన్నారు.