PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ప్రారంభించిన ఏలూరు అర్బన్ అథారిటీ చైర్మన్

1 min read

పేద ,మధ్యతరగతి, ప్రభుత్వ ఉద్యోగులకు మంచి అవకాశం

పూర్తి మౌలిక వసతులతో జగనన్న స్మార్ట్ టౌన్షిప్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  ఏలూరు మండలం శనివారం పేట 26వ డివిజన్ పరిసర ప్రాంతంలో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ ఏలూరు అర్బన్ అథారిటీ చైర్మన్ (ఇడ) బోద్దాని శ్రీనివాస్ శుక్రవారం కార్యాలయ సమావేశ మందిరంలో లాంఛనంగా ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కల సహకారం చేయుటకు సరసమైన ధర మరియు స్పష్టమైన యాజమాన్య హక్కులు గల ప్లాట్లు అందజేసే ఉద్దేశంతో ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వారి ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం లో 35 ఎకరాల విస్తీర్ణంలో 386 ప్లాట్లతో ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా పూర్తి మౌలిక వసతులతో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పేరుతో MIG layout ఏర్పాటు చేయుటకు అనుమతించి ఉన్నారనీ తెలిపారు. పేద, మధ్య తరగతి మరియు ప్రభుత్వ ఉద్యోగులకు అవకాశం కల్పించబడినదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి మరియు ఏలూరు శాసనసభ్యులు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) ఆశీస్సులతో ఇంతటి బృహత్రా కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. ప్లాటు విస్తీర్ణం తగ్గట్టుగా ప్లాటు ఖరీదు చెల్లించవలసి ఉంటుందని తెలిపారు. ప్లాట్ చదరపు గజం రేటు రూ: 8,999/- లుగా నిర్ధారించబడిందని తెలిపారు. ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ప్లాట్స్ ఆమోదించబడతాయని వివరించారు. దాన్లో భాగంగా నాలుగు  విభాగాల లో ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. ఎంపికైన లబ్ధిదారులకు అలాట్మెంట్ పత్రాలను అందజేశారు.

1, ఏర్పాటు చేయు మౌలిక సదుపాయాలు..

2, 60 అడుగుల తారు రోడ్లు మరియు 4O అడుగుల సిమెంట్ కాంక్రీట్ రోడ్లు.

3, కలర్స్ టైల్స్ తో ఫుట్ పాత్ లు.

4, ఎవెన్యూ ప్లాంటేషన్.

5, మంచినీరు సదుపాయం.

6, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మరియు వర్షపు నీటి డ్రైన్స్.

7, వీధి దీపాలు పార్కులు మరియు ఆట స్థలములు.

8, సామాజిక అవసరాల కొరకు ప్రత్యేక స్థలాలు.

9, ఆహ్లాదకర సువిశాలమైన ప్రాంతంలో ఏర్పాటు చేయడమైనదని తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ డి చంద్రశేఖర్, ప్లానింగ్ ఆఫీసర్స్ ఎన్ సురేఖ, వి సుధాకర్, సెక్రటరీ తిరుమల రావు, డి.ఇ ఎన్ రామారావు, ప్లానింగ్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.

About Author