సుప్రీంకోర్టు ఆదేశాల ధిక్కరించిన సీఎం జగన్… మాజీ మంత్రి
1 min readఅంగన్వాడీల శ్రమను దోపిడీ చేస్తున్న వైసీపీ ప్రభుత్వం….
సమ్మె సంపూర్ణ మద్దతు తెలిపిన టి. డి. పి….
పల్లెవెలుగు వెబ్ చాగలమర్రి : అంగన్వాడీలకు గ్రాట్యుటీ అమలు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించారని మాజీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. శుక్రవారం చాగలమర్రి పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద 18వ రోజు అంగన్వాడీలు, అంగన్వాడి సహాయకులు, ఏఐటీయూసీ, సీఐటీయూ, సంయుక్త ఆధ్వర్యంలో చేస్తున్న నిరాహార దీక్షకు అఖిల ప్రియ హాజరై సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా దీక్ష శిబిరంలో బైఠాయించిన ఏఐటీయూసీ, అనుబంధ సంస్థ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ చంద్రకళ, మండల నాయకురాలు వహీదా, హసీనా, ఆసానమ్మ,ఇందుమతి, సుజాత, రహమత్ , సిఐటియు అనుబంధ సంస్థ నాయకురాలు సంజమ్మ, రజిని, రామసుబ్బమ్మ, నాగమణి, వివిధ గ్రామాల నుండి హాజరైన అంగన్వాడి కార్యకర్తలు అంగన్వాడి సహాయకులు, ప్రభుత్వానికి నివేదించిన డిమాండ్లను మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కు తెలియజేశారు.దీక్ష శిబిరం వద్దకు చేరుకున్న అఖిలప్రియకు అంగన్వాడి వర్కర్స్ పూలదండలతో స్వాగతం పలుకగా ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మీ సమస్యలు నెరవేరేంతవరకు నేను మీతో పూలదండలు వేయించుకోనని, అంగన్వాడీల సమస్యల పరిష్కారం కోసం తాను అండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసి, మహిళల శ్రమను దోపిడీ చేస్తుందని వైసీపీ ప్రభుత్వం పై మాజీ మంత్రి అఖిలప్రియ విమర్శించారు. మహిళల గోడు వినిపించుకోకుండా, గత 18 రోజులుగా మహిళలు రోడ్డు ఎక్కి దీక్షలు చేస్తున్న పట్టించుకోకుండా ముఖ్యమంత్రి పరిపాలన చేయడం ప్రజలు గమనిస్తున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితులలో వైసిపి పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాల ప్రకారం తమ హక్కులు సాధించాలని దీక్షలో ఉన్న మాపై బెదిరింపు ధోరణితో కక్ష సాధింపుతో సచివాలయ సిబ్బందితో, అంగన్వాడి తాళాలను పగలగొట్టి అంగన్వాడి నిర్వహణ సచివాలయ సిబ్బందికి అప్ప చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకు అంగన్వాడి నిర్వహణ పట్ల అవగాహన ఉందా అని ప్రశ్నించారు. నేను చెప్పిందే చేయాలని అహంకార దృష్టితో ముఖ్యమంత్రి జగన్ పరిపాలన గాడి తప్పిందన్నారు. ఎవరిని ఉద్ధరించడానికి వచ్చారో తెలియదు గాని తెలంగాణలో అభివృద్ధి చూస్తుంటే మన రాష్ట్రంలో జరుగుతున్న నియంతృత్వ పాలనలో అభివృద్ధి శూన్యం అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే అంగన్వాడి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. సమయానికి జీతాలు ఇవ్వక, అంగన్వాడి నిర్వహణకు కావాల్సిన వాటిని అంగన్వాడి టీచర్లు సమకూర్చుకోవడం జరుగుతుందని, అంగన్వాడి అద్దెలు, టి ఏ డి ఏ లు ఇతర బకాయిలు 2017 నుండి చెల్లించకపోవడం వల్ల పలు ఇబ్బందులకు గురవుతున్నారని, ఇలాంటి ప్రభుత్వాన్ని నిలదీస్తూ వచ్చే ఎన్నికల్లో మహిళలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అఖిలప్రియ అంగన్వాడీలు,ఆశ వర్కర్లు, రైతులు, యువత, ప్రశాంతంగా ఉన్న పరిస్థితి లేదన్నారు. దీక్షా శిబిరానికి చేరుకున్న భూమా అఖిలప్రియ వెంట చాగలమర్రి మండల తెలుగుదేశం అధ్యక్షులు అనీఫ్, మండల కన్వీనర్ నరసింహారెడ్డి, తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకుడు గుత్తి నరసింహుడు, టిడిపి నాయకులు కొలిమి హుస్సేన్ వలి, షాబుల్, మౌలాలి, గఫార్,మాజీ వార్డు మెంబర్ అబ్దుల్లా, అక్బర్, వివిధ గ్రామాల నుండి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.