జిల్లాకోర్టులో ఆళ్ళ నాని పుట్టిన రోజు వేడుకలు..
1 min readమరోసారి జిల్లా మంత్రి కావాలని పలువురు ఆకాంక్ష
పల్లెవెలుగు వెబ్ పశ్చిమగోదావరి: రానున్న ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో గెలుపొంది జగన్ సారధ్యంలో మరోసారి మంత్రి గా పనిచేయాలని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ డి.వి.రామాంజనేయులు, ఆచంట వెంకటేశ్వరరావు, సి.హెచ్.రాజేంద్రప్రసాద్ లు ఆకాంక్షించారు. ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలోని ఏ.పి.పి.ల కార్యాలయం లో ఈరోజు ఉదయం మాజీ ఉపముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖా మంత్రివర్యులు, ఏలూరు శాసన సభ్యులు, వైఎస్ఆర్ సిపి ఏలూరు జిల్లా అధ్యక్షులు ఆళ్ళ కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) పుట్టిన రోజు సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ.పి.పి లు మాట్లాడుతూ ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ళ నాని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ, ఏలూరు నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారని వారు పేర్కొన్నారు. కార్యక్రమం లో జిల్లా కోర్టుల అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఆచంట వెంకటేశ్వరరావు, సి.హెచ్. రాజేంద్రప్రసాద్,డి.వి.రామాంజనేయులు, పి.పి కోనే సీతారామ్, ప్రభుత్వ న్యాయవాది (జి.పి)బుడ్డా జగన్నాథ రెడ్డి మరియు న్యాయవాదులుపి. శ్యామ్ సాగర్, వి.వి.ఎస్.రామారావు, ఏ.విజయకుమారి, మోహాన్ చంద్ర,ఎమ్.రవి, పి.ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.