NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టిడిపి ప్రజలకు అందించే పథకాలపై అవగాహన కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్​ హోళగుంద :  ఆలూరు నియోజకవర్గం హొళగుంద మండలం హెబ్బటం గ్రామంలో…..హొళగుంద మండల టీడీపీ యువనాయకుడు శ్రీ పి,విష్ణువర్ధన్ రెడ్డి  ఆధ్వర్యంలో బూత్ నెంబర్ 55,56,57,58, లో యూనిట్ ఇంచార్జ్ బోయ సవరప్ప, బూత్ ఇంచార్జ్ లు బి,మల్లికార్జున, శేక్షవలి,కలిసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు  మహానాడు వేదికగా ప్రవేశపెట్టిన “బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమం నిర్వహించి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజలకు అందించే పథకాలు గురించి తెలియపరిచి,రిజిస్ట్రేషన్ నమోదు చేసి కరపత్రాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు.కార్యకర్తలు. బూత్ కమిటీ అధ్యక్షులు. తదితరులు పాల్గొన్నారు.

About Author