కర్నూలు సమగ్రాభివృద్ధే లక్ష్యం
1 min read– కర్నూలు నగర మేయర్ బి.వై.రామయ్య వెల్లడి
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: కర్నూలు నగర అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు నగర మేయర్ బీవై రామయ్య. శనివారం కలెక్టరేట్లోని సునయనా ఆడిటోరియంలో నగర వార్డు సభ్యులకు – వార్డు కార్యదర్శులకు కర్నూలు నగర పాలక సంస్థ నిర్వహించిన అవగాహన సదస్సు రెండవ రోజు సచివాలయ సంక్షేమ, ప్లానింగ్ కార్యదర్శులతో సదస్సు జరిగింది. కమిషనర్ డి.కే బాలాజీ గారి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సుకు మేయర్ బి.వై రామయ్యతో పాటు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ , కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ బాబు డిప్యూటీ మేయర్ సిద్దారెడ్డి రేణుకా గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ బి.వై రామయ్య గారు మాట్లాడుతూ నగరాభివృద్ధిలో పట్టణ ప్రణాళిక విభాగం ఎంతో కీలకమైనదన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయించింది సంక్షేమానికేనని, తద్వారా ఆ నిధులు పథకాల రూపంలో ప్రజలకు చేరవేయడంలో సంక్షేమ కార్యదర్శులదే కీలక పాత్ర అన్నారు. ఆక్రమణలపై పట్టణ ప్రణాళిక అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ రామలింగేశ్వర్, నగర పాలక కార్యదర్శి వెంకటేశ్వర్లు, సీఎంఎం మురళి, పీవో రాధికారెడ్డి, డిసిపి కోటయ్య, ఏసిపి శ్రీనివాస చైతన్య, డిఈ బి.రవిప్రకాష్ నాయుడు వివిధ శాఖల అధిపతులు పాల్గొన్నారు.